Pawan is trying to take the film industry to AP: ఆంధ్రప్రేదశ్ కు టాలీవుడ్ వెళ్లిపోతుందని గత వారం రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సినీ పరిశ్రమను ఏపీలో విస్తరించడానికి తన వంతు సహకారం అందిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో సినిమా ఇండస్ట్రీకి ఏపీ స్వాగతం పలుకుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. అంతకు ముందు నుంచే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ ఏపీకి వెళ్లిపోవాలని సలహాలివ్వడం ప్రారంభించారు. ఈ పరిణామాలతో ఏపీకి ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న ప్రచారం ఊపందుకుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుందన్న ప్రభుత్వం
ఏపీకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ప్రచారంతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయ్యారు. తమకు సినీ పరిశ్రమపై ఎందుకు కోపం ఉంటుందని ప్రశ్నించారు. అర్జున్ విషయంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని .. సినిమా రంగానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. ఏపీకి సినీ పరిశ్రమ అని ప్రచారం చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆలా మాట్లాడుతున్న వారిపై ఘాటు విమర్శలు చేశారు. మరో వైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కూడా అదే చెబుతున్నారు. ఇండస్ట్రీ ఎక్కడికి పోదని స్పష్టం చేశారు.
Also Read: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
హైదరాబాద్ నుంచి పొమ్మన్నా పోలేనంతగా పాతుకుపోయిన సినీ ఇండస్ట్రీ
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో పాతుకుపోయిది . మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందాయి. ఇండస్ట్రీ అంటే ఒక్క షూటింగ్ కాదు. ఆ షూటింగ్ కథకు అవసరంగా ఎక్కడైనా జరుగుతుంది. ఏపీలో జరుగుతుంది.. అమెరికాలో కూడా జరుగుతుందని చెబుతున్నారు. ఇంకెక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ది చెందవచ్చు కానీ ఇక్కడి నుంచి పోయి అక్కడ స్థిరపడుతుందని ఎవరూ అనుకోలేరు. ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాల్సి ఉంది. అది ప్రభుత్వం చేతుల్లో లేదు. అవకాశాల్ని బట్టి డెవలప్ కావాలి. అంటే.. ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి కదిలే అవకాశం లేదు.కానీ ఏపీలో అభివృద్ధి చెందవచ్చు. ఆ అభివృద్ది హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నారు.
Also Read: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
అప్పటి సినీ పరిశ్రమ కాదు !
ఒకప్పుడు అరవై రోజుల్లో సినిమా తీసేసేవారు. ఎక్కువగా స్టూడియోల్లో షూటింగులు జరిగిపోయేవి . రాను రాను సినిమాల తీరు మారిపోయింది. ఇప్పుడు స్టూడియోల్లోనూ దాదాపుగా అన్ని సినిమాలుక ప్రత్యేకమైన సెట్లు వేస్తున్నారు. ఔట్ డోర్ షూటింగ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం హైదరాబాద్ నుంచే సాగుతుంది. ఇండస్ట్రీ ఓ విలక్షణమైనది . సినిమా రంగానికి చెందిన వారు ఒకరిద్దరికి సమస్యలు వచ్చినప్పుడు ఇలా వ్యాఖ్యానించడం కామనేనని కానీ..ఒక్కరు కూడా కదలరని అంటున్నారు. దీనికి సాక్ష్యం ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలే. తాను ఏపీకి వెళ్లి ఏం చేస్తానని నిర్మోహమాటంగా ఆయన ప్రకటించేశారు.