సినీ నటుడు నరేష్  పవిత్ర లోకేష్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ విషయంలో గత కొంత కాలంగా నరేష్ పవిత్రా లోకేష్ పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిపై ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ట్రోల్స్ పై స్పందించని పవిత్ర.. ఉన్నట్టుండి సీరియస్ అయ్యింది. తనను కొంతమంది వేధిస్తున్నారని పలు యుట్యూబ్ చానెళ్లపై సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీంతో 15 యుట్యూబ్ చానెళ్లకు నోటీసులు జారీ అయ్యాయి. చిన్నగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలి వానగా మారేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వివాదంలోకి నరేష్ భార్య రమ్య రఘుపతి ఎంటరైంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నరేష్ భార్య రమ్య కొన్ని యుట్యూబ్ ఛానెళ్లను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆరోపిస్తోంది పవిత్రా. 


అసలు వివాదం ఎలా మొదలైందంటే..


సినీ ఇండస్ట్రీలో నరేష్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా చేసినా ప్రస్తుతం సహాయ నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో నరేష్ తన భార్య రమ్య రఘుపతి విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. ప్రస్తుతం ఈ విడాకుల వ్యవహారం కోర్ట్ లో ఉంది. అయితే నరేష్ గత కొంత కాలంగా సినీ నటి పవిత్రా లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఓ రోజు నరేష్, పవిత్ర హోటల్ గదిలో ఉండగా ఆయన భార్య రమ్య అక్కడికి వెళ్లడంతో ఈ వివాదం మొదలైంది. అప్పట్నుంచీ వీళ్ళ వ్యవహారంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 


ట్రోలింగ్స్ ఎక్కువవ్వడంతో ఫిర్యాదు


చాలా రోజులుగా పవిత్ర పై ట్రోలింగ్ జరుగుతూనే ఉన్నా ఆమె స్పందించలేదు. అయితే ఈ మధ్య ఆమె పై ట్రోలింగ్ ఎక్కువవ్వడంతో అసహనానికి గురైంది పవిత్ర. దీంతో కొన్ని యుట్యూబ్ చానెళ్లపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా నరేష్ భార్య రమ్య పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పవిత్ర. తన పరువుకు నష్టం కలిగే విధంగా రమ్య వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొంది. తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా యూట్యూబ్ చానెళ్లు వార్తలు చూపించడం వెనుక రమ్య హస్తం ఉందని ఆరోపించింది పవిత్ర. ఆ యుట్యూబ్ ఛానెళ్లను ఆమే నడిపిస్తోందని పేర్కొంది.  గతంలో కూడా తనపై రమ్య దాడి చేయడానికి ప్రయత్నించిందనీ చెప్పుకొచ్చింది. రమ్య, నరేష్ లకు కుటుంబ తగాదాలు ఉన్నాయని, ఆమెకు ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసుల్లో జోక్యం ఉందని చెప్పింది.  నరేష్, అలాగే తన పై అసభ్యకర వీడియోలు, వార్తలు క్రియేట్ చేసి ఫార్వార్డ్ చేస్తున్నారని పేర్కొంది. వీటన్నిటిని రమ్య రఘుపతి వెనకుండి నడిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది పవిత్రా లోకేష్. మరి దీనిపై నరేష్ భార్య రమ్య రఘుపతి ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Read: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!