‘జీరో’ మూవీ పరాభవం తర్వాత సుమారు 4 ఏండ్లకు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్.     ‘పఠాన్’ మూవీతో థియేటర్లలోకి అడుగు పెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన తొలి రోజునే కలెక్షన్ల సునామీ సృష్టించింది. దేశీయంగా మొదటి రోజునే రూ. 55 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ హైహెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు సాధించి అబ్బుర పరిచింది. తొలి వారంలో ఏకంగారూ. 500 కోట్లకు పై  వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది.   


షారుఖ్ ను ఒప్పించే బాధ్యత ఆదిత్య చోప్రాకు అప్పగింత!    


వాస్తవానికి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చాలా కాలంగా షారుఖ్ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. ఆ మూవీ కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా ఉండాలి అనుకున్నాడు. షారుఖ్ ను దృష్టిలో పెట్టుకుని ‘పఠాన్’ మూవీ కథ రెడీ చేసుకున్నాడు. చాలా రోజులు కష్టపడి ఈ సినిమాకు అద్భుత కథను డెవలప్ చేశాడు. స్టోరీ పూర్తయ్యాక చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రాకు వివరించాడు. కథ తనకు చాలా బాగా నచ్చింది. వెంటనే సినిమాను తీద్దామని చెప్పారు. ఈ సినిమాలో హీరోగా షారుఖ్ అయితే బాగుంటుందని దర్శకుడు సిద్ధార్థ్, ఆదిత్యకు చెప్పాడు. ఈ సినిమాలో నటించేలా షారుఖ్ ను ఒప్పించే బాధ్యత చోప్రాకే అప్పగించాడు.


పఠాన్’ గురించి విని షారుఖ్ ఏమన్నారంటే?


కథ వినగానే షారుఖ్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. “ఒక రోజు వీలు చూసుకుని చోప్రా, షారుఖ్ ను కలిశారు. వాస్తవానికి వీరిద్దరు మంచి మిత్రులు. సినిమా గురించి కాకుండా, క్యాజువల్ గా మీటయ్యారు. తను మంచి మూడ్ లో ఉంటే సినిమా గురించి చెప్పాలి అనుకున్నారు. వెళ్లి కాసేపు మాట్లాడారు. షారుఖ్ కాస్త ప్రీగానే ఉండటంతో నెమ్మదిగా ‘పఠాన్’ మూవీ గురించి చెప్పారు. షారుఖ్ కు ఈ స్టోరీ బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. మరుక్షణంలో చోప్రా నాకు  ఫోన్ చేసి షారుఖ్ ఓకే చెప్పారన్నారు. ఆ సమయంలో నేను మిత్రులతో బయట ఉన్నాను. తను చెప్పిన మాట నేను నమ్మలేకపోయాను. షారుఖ్ తో సినిమా ఊహకే గొప్పగా అనించింది” అని సిద్ధార్థ్ తెలిపారు.           


ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ఆమె ఐఎస్ఐ ఏజెంట్  డాక్టర్ రుబీనా మొహ్సిన్ పాత్రలో కనిపించింది. జాన్ అబ్రహం ఈ సినిమాలో నెగెటివ్ రోల్ ప్లే చేశారు. సల్మాన్ ఖాన్ ఇందులో అతిథి పాత్రలో కనిపించారు. డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా, ప్రకాష్ బెలవాడి, ఏక్తా కౌల్, నిఖత్ ఖాన్, తదితరులు సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. 


Read Also: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!