నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ కలిసి నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీరామ నవమి కానుకగా మార్చి 30న విడుదలైంది. పాన్ ఇండియన్ సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించింది. నాని కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
‘దసరా’ సినిమాపై ప్రభాస్ ప్రశంసలు
‘దసరా’ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాని, కీర్తి నటనతో పాటు దర్శకుడి చిత్రీకరణ విధానం అద్భుతం అంటూ అభినందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రానా ఈ చిత్రం అద్భుతం అంటూ కొనియాడారు. తాజాగా ఈ లిస్టులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేశారు. ఈ సినిమా అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. “ఇప్పుడే ‘దసరా’ సినిమా చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో నటించిన నానికి నా అభినందనలు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, కీర్తి సురేష్, మిగిలిన టీం అంతా బాగా వర్క్ చేశారు. మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి అంటూ ఇన్ స్టాలో చెప్పుకొచ్చారు.
ప్రభాస్ కు ధన్యవాదాలు చెప్పిన ‘దసరా’ టీమ్
ప్రభాస్ రియాక్షన్ పై దసరా మూవీ టీమ్ స్పందించింది. “డార్లింగ్ రెబ్ స్టార్ ప్రభాస్ గారిని ధన్యవాదాలు, అతడు ‘దసరా’ సినిమాను ఇష్టపడటం సంతోషంగా ఉంది. ధూమ్‌ధామ్ బ్లాక్‌బస్టర్ గురించి ఇంత గొప్ప మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సర్” అంటూ ట్వీట్ చేసింది.
సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘దసరా’ చిత్రం
పాన్ ఇండియన్ మూవీ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ భారీగా వసూళ్లు సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ చిత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, పాటలు జనాల్లో బాగా వెళ్లాయి. ఆడియెన్స్ అంచనాలు ఏమాత్రం వమ్ము చేయకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియన్ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది.
Read Also: రష్మిక మందన్న లీడ్ రోల్ లో ‘రెయిన్ బో’, కొత్త సినిమాను ప్రకటించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్