Satyadev’s Action Thriller Zebra OTT Announcement: కొంత కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న తెలుగు హీరోల్లో సత్య దేవ్ ఒకరు. ఆయన నటించిన తాజా సినిమా ‘జీబ్రా’. ఇందులో ‘పుష్ప’ ఫేమ్, కన్నడ కథానాయకుడు డాలీ ధనుంజయ్ మరో హీరోగా నటించారు. వాళ్లిద్దరి నటనకు మంచి పేరు రావడమే కాదు... ప్రేక్షకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉంది.


ఆహా ఓటీటీలోకి 'జీబ్రా'
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెలలో విడుదలైంది. త్వరలో ఈ సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు ఆహా వర్గాలు వెల్లడించాయి.






ఇంతకీ 'జీబ్రా' కథలోకి వెళితే... సూర్య (సత్యదేవ్), స్వాతి (ప్రియా భవానీ శంకర్) బ్యాంక్ ఉద్యోగులు. సూర్య ఆమెను లవ్ చేస్తాడు కూడా. ఓ రోజు స్వాతి పొరపాటున ఓ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డబ్బును పొరబాటున మరో ఖాతాకి మళ్లిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని కొన్ని లొసుగుల్ని ఉపయోగించి, ఆమె డబ్బును వెనక్కి రప్పిస్తాడు సూర్య. కానీ అనుకోని విధంగా సూర్య ఓ స్కామ్ లో ఇరుక్కుంటాడు. సూర్య బ్యాంకు ఖాతాలోకి హఠాత్తుగా 5 కోట్లు జమ ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి తనవే అంటూ సూర్య లైఫ్ లోకి ఆది(డాలీ ధనుంజయ్) ఎంటర్ అవుతాడు.  అసలు ఎవరీ ఆది? ఆ స్కామ్ వల్ల సూర్య జీవితం ఎటువంటి మలుపులు తిరిగిందనే మిగతా కథ.


Also Readమిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?


బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల నేపథ్యంలో చాన్నాళ్ల క్రితం ‘స్కామ్ 1992’ వచ్చింది. ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ కూడా సరిగ్గా ఇటువంటి కథాంశంతోనే రూపొందింది. ‘జీబ్రా’ కూడా ఆన్లైన్ మోసాల నేపథ్యంలో సాగుతుంది. ఉన్నట్టుండి ఖాతాల్లోంచి డబ్బులు మాయం కావడం లేదంటే పెద్ద మొత్తంలో జమకావడం లాంటి ఆన్ లైన్ సైబర్  క్రైమ్స్ గురించి రోజూ వింటూనే ఉన్నాం. రియల్ ఇష్యూస్ ను బేస్ చేసుకొని కథను కొంత వరకూ బాగానే డీల్ చేశారు దర్శకుడు ఈశ్వర్ కార్తీక్. అయితే, కథ బాగానే ఉన్నా, కథనం వీక్ కావడంతో ‘జీబ్రా’ ఆశించినంత విజయం సాధించలేదు. తమిళ నటుడు సత్యదేవ్, కమెడియన్ సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలోనే ఆహా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.


Also Readఒక్కర్నే బాధ్యుణ్ణి చేస్తే ఎలా? అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన సెలబ్రిటీలు వీళ్లే



ప్రశంసలు దక్కినా...వసూళ్లు లేవు


సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సత్యదేవ్ కు ‘జీబ్రా’ సినిమా నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. క్రిటిక్స్ ప్రశంసలు దక్కినా, థియేట్రికల్ గా సక్సెస్ కాలేదు. మొదటి నుంచీ మంచి పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న సత్యదేవ్ కు ‘బ్లఫ్ మాస్టర్’ మంచి గుర్తింపు తెచ్చింది. వసూళ్లను మాత్రం కాదు. కరోనా సమయంలో ‘లాక్డ్’, ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సిరీస్ ల్లో నటించారు. 2020లో ఆయన హీరోగా నటించిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఓటీటీలో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘పిట్టకథలు’, ‘తిమ్మరసు’, ‘స్కైల్యాబ్’, ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలూ చేశారు. అక్షయ్ కుమార్ తో కలిసి ‘రామసేతు’ అనే హిందీ సినిమా చేశారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్ ’ లో విలన్ గానూ నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలేవీ ఆయన కెరీర్ కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఆయన ‘ఫుల్ బాటిల్’, ‘గరుడ చాప్టర్ 1’ సినిమాలు చేస్తున్నారు. ‘అరేబియా కడలి’ అనే అమెజాన్ ప్రైమ్ ప్రాజెక్ట్ లోనూ నటిస్తున్నారు సత్యదేవ్. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.