థియేటర్ల నుండి ఓటీటీల వరకు ఈ సంవత్సరం సినిమాలు, సిరీస్‌ల సందడి కనిపించింది. OTTలో చాలా సిరీస్‌లు వచ్చాయి. కొన్నింటిని వీక్షకులు బాగా మెచ్చుకున్నారు. మరికొన్ని సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటీటీ షోలు ఏమిటో ఈ జాబితా చూడండి.
1. స్క్విడ్ గేమ్ సీజన్ 3ఈ కొరియన్ డ్రామా 2021 నుండి అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది ఈ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది. అయితే అంతకు ముందు కొత్త కథ కోసం ప్రేక్షకులు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. జూన్ 27 నుండి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ కథలో జీవితం, మరణం, ప్రాణాలకు తెగించి ఆడే ఆట చూపబడుతుంది.
2. ఢిల్లీ క్రైమ్ సీజన్ 3ఈ సిరీస్ రెండో సీజన్ 2022లో విడుదలైంది. మూడు సంవత్సరాల తర్వాత మూడో సీజన్‌ను చూశారు. షెఫాలీ షా ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ వీక్షకులను బాగా అలరించింది. కథ ప్రేక్షకులను బాగా భయపెట్టింది. DCP వర్తికా సింగ్ పాత్రలో షెఫాలీ షా నటన ప్రశంసలు అందుకుంది. కొత్త సీజన్‌లో హుమా ఖురేషీ కూడా భాగమైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథ రాశారు. కొత్త సీజన్‌లో కూడా సిరీస్ తన అద్భుతమైన ట్విస్ట్‌లు, టర్న్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
3. మహారాణి సీజన్ 4 హుమా ఖురేషీ పాపులర్ 'మహారాణి' కూడా ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సిరీస్‌లలో ఒకటి. ఇందులో బీహార్ రాజకీయాలను చాలా సూక్ష్మంగా ప్రేక్షకులకు చూపించారు. రాణి భారతి పాత్రలో హుమా ఖురేషీ మరోసారి తనదైన ముద్ర వేసింది. ఈసారి కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ రాణి భారతి జాతీయ వేదికపైకి వచ్చి అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది.
4. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన హిట్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'. నవంబర్ 21 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. సిరీస్ విడుదల కావడానికి ముందు అభిమానులు చాలా కాలం వేచి ఉండేలా చేసిందీ సిరీస్. ఈసారి జయదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ వంటి కొత్త నటీనటులు సిరీస్‌లో అడుగు పెట్టారు. అయితే శ్రీకాంత్ తివారీ ఎప్పటిలాగే ఈసారి కూడా తన అభిమానుల హృదయాలలో తన చెరగని ముద్ర వేశారు.
Also Read: Year Ender 2025: ఖాన్‌లు, కపూర్‌లు కాదు... బాలీవుడ్‌లో ఈ ఏడాది అదరగొట్టిన హీరోలు వీళ్ళే
5. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5: వాల్యూమ్ 1ది డఫర్ బ్రదర్స్ హిట్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5: వాల్యూమ్ 1'. ఇది చివరి సీజన్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. నవంబర్ 26న విడుదలైంది. అప్పటి నుండి సిరీస్ మీద చర్చలు ప్రారంభమయ్యాయి. మొదటి వాల్యూమ్‌లో కేవలం 4 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా మేకర్స్ తమ అభిమానులకు చివరి ఎపిసోడ్‌లను చూపించబోతున్నారు.