Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2 ది రూల్' సినిమా ఓపెనింగ్ డే 160 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా గేమ్‌ను మార్చేసింది. సినిమాకు ఉన్న క్రేజ్, పుష్ప పాత్ర, పాన్ ఇండియా అప్పీల్ కలిసి ఈ సినిమాను ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాగా మార్చాయి.
షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' విడుదలైన రోజే 65 కోట్లకు పైగా వసూలు చేసి భారీ ఓపెనింగ్ సాధించింది. యాక్షన్, ఎమోషన్, సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన హారర్ కామెడీ 'స్త్రీ 2' అందరినీ ఆశ్చర్యపరుస్తూ... ఓపెనింగ్ డే 55 కోట్లకు పైగా అద్భుతమైన వసూళ్లు సాధించింది.
షారుఖ్ ఖాన్ గ్రాండ్ రీ ఎంట్రీ మూవీ 'పఠాన్' ఓపెనింగ్ డే కలెక్షన్స్ 55 కోట్లు. ఈ సినిమా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.
రణబీర్ కపూర్ 'యానిమల్' ఫస్ట్ డే 54 కోట్లు వసూలు చేసింది.
యష్ 'కేజీఎఫ్ 2' సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ లో కూడా రికార్డులు సృష్టించింది. సౌత్ సినిమా అయినా బాలీవుడ్ పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చింది. ఈ సినిమా హిందీలో 53 కోట్లు సంపాదించింది.
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' యాక్షన్ ప్రియులను థియేటర్లకు రప్పించింది. ఈ సినిమా మొదటి రోజున 51 కోట్లతో మంచి వసూళ్లు సాధించింది.
ఆమిర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాకు మొదట మిశ్రమ స్పందన వచ్చినా... మొదటి రోజున 50 కోట్ల వసూళ్లు రాబట్టింది.
సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాకు ఫెస్టివల్ సీజన్ రిలీజ్ కలిసి వచ్చింది. ఈ సినిమా మొదటి రోజునే బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్లకు పైగా వసూలు చేసింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన స్పై యూనివర్స్ 'టైగర్ 3' ఓపెనింగ్ డే 40 కోట్లకు పైగా వసూళ్లతో ఘనంగా ప్రారంభమైంది. అయితే హయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డు 'పుష్ప 2' పేరిట ఉంది.