Horror Thriller Weapons OTT Release On Amazon Prime Video: హారర్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక హాలీవుడ్ హారర్ థ్రిల్లర్స్ అంటే ఆ రేంజ్ వేరు. రూ.335 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.2 వేల కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు థియేటర్స్‌లో ఉండగానే సడన్‌గా సర్ ప్రైజ్ ఇస్తూ ఓటీటీలోకి రానుంది. ఆ మూవీనే హాలీవుడ్ లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్'.

4 ఓటీటీల్లో స్ట్రీమింగ్

చాలా రోజుల తర్వాత ఆడియన్స్‌ను భయపెట్టిన మూవీ 'వెపన్స్'. వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ జరుగుతుండగానే మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ఓటీటీల్లో మూవీని అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీంతో పాటే బిగ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు.

ఈ నెల 9 నుంచి 'వెపన్స్' మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'తో పాటు యాపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, మూవీని చూడాలంటే మాత్రం రెంట్ చెల్లించాల్సిందే. థియేటర్లకు వెళ్ల లేని వారి కోసం ఓటీటీలోకి సడన్‌గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి జాక్ గ్రెగర్ దర్శకత్వం వహించగా... జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ వంటి స్టార్స్ నటించారు. 

Also Read: మహేష్ ఫస్ట్ లుక్ ఒక్కటే కాదు - 'SSMB29' ఎపిక్ అనౌన్స్‌మెంట్ కూడా ఆ రోజే... జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు

స్టోరీ ఏంటంటే?

రీసెంట్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్స్‌లో ది బెస్ట్‌గా నిలిచింది 'వెపన్స్' మూవీ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను ఆద్యంతం భయపెట్టారు మేకర్స్. ఓ స్కూల్‌లో పిల్లలు సడన్‌గా కనిపించకుండా పోతారు. తెల్లవారుజామున ఒకే తరగతికి చెందిన స్టూడెంట్ తప్ప మిగిలిన 17 మంది మిస్ అవుతారు. వాళ్లు ఎలా ఎక్కడికి వెళ్లారు? అనేదే బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. హారర్, సస్పెన్స్, డార్క్ కామెడీ అన్నీ కలగలిపి ఈ మూవీని రూపొందించారు.