Kannada Horror Comedy Su From So OTT Release On Jio Hotstar: ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ ఏది అంటే కచ్చితంగా గుర్తొచ్చేది కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో'. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు అన్నీ భాషల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శుక్రవారం ఓటీటీలోకి వస్తుందని భావించినప్పటికీ ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది.
ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. కన్నడ, తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో సంధ్య ఆరకెరె, జేపీ తుమినాడ్, ప్రకాశ్ తుమినాడ్, శనీల్ గౌతమ్, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. జెపి తుమినాడ్ దర్శకత్వం వహించగా... లైట్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్ బి శెట్టి నిర్మించారు. సందీప్ తులసిదాస్ మ్యూజిక్ అందించారు.
జులై 25న కన్నడలో రిలీజై సంచలన విజయం సాధించగా తెలుగు ఆడియన్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆగస్ట్ 8న రిలీజ్ చేసింది. రూరల్ కామెడీ బ్యాక్ డ్రాప్‌తో 'సు ఫ్రమ్ సో' అందరినీ కడుపుబ్బా నవ్వించింది.
Also Read: 'సైమా అవార్డ్స్ 2025' విన్నర్స్ లిస్ట్: 'పుష్ప 2'కు నాలుగు... సత్తా చాటిన 'కల్కి', 'హనుమాన్'
రూరల్ కామెడీ స్టోరీ
జానపదం, గ్రామాల్లో మూఢ నమ్మకాలు బ్యాక్ డ్రాప్‌గా 'సు ఫ్రమ్ సో' అందరినీ కాస్త భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది. ఇక కథ విషయానికొస్తే... కర్ణాటకలోని దర్శస్థలి ప్రాంతంలో ఓ పల్లెటూరు. గ్రామంలో ఉండే అశోక్ (జె పి తుమినాడ్) ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ తన లవర్ ఇంటి దగ్గర ఆగి ఆమెను చూడాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆ ఇంటి బాత్రూం నుంచి ఆ అమ్మాయి గొంతు వినిపించడంతో దొంగతనంగా ఆమెను చూసేందుకు యత్నిస్తాడు. ఇలా చేస్తున్న టైంలోనే అతన్ని ఇద్దరు పట్టుకుంటారు.
దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు తనకు దెయ్యం పట్టినట్లుగా అశోక్ డ్రామా ఆడతాడు. ఈ విషయం తెల్లారేసరికి ఊరంతా పాకిపోతుంది. ఆ దెయ్యాన్ని వదిలించాలని ప్రయత్నాలు మొదలుపెడతారు ఊరి పెద్దలు. గ్రామ పెద్ద రవన్న (షానిల్ గౌతమ్) సిటీ నుంచి కరుణాజీ స్వామీజీ (రాజ్ బి శెట్టి)ని తీసుకొచ్చి దెయ్యాన్ని వదిలించాలంటాడు. అసలు అశోక్‌ను నిజంగా దెయ్యం ఆవహించిందా? దెయ్యంగా అతని చేష్టల వల్ల ఊరి వారు పడ్డ ఇబ్బందులు ఏంటి? కరుణాజీ స్వామీ దెయ్యాన్ని వదిలించేందుకు చేసింది ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆద్యంతం సర్ ప్రైజ్ ఇస్తాయి. చిన్న కథను రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వించేలా రూపొందించారు మేకర్స్.