Rajamouli Big Plan To Mahesh Babu First Look From SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'SSMB29' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా... ప్రస్తుతం కెన్యా, నైరోబిలో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్‌లో మహేష్ తన పార్ట్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా ఈ మూవీపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు

రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్‌తో పాటు 'Globe Trotter' అంటూ హిట్ ఇచ్చిన రాజమౌళి నవంబరులో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో భారీ హైప్ క్రియేట్ కాగా... ఆ రోజు కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. తాజా టాక్ ప్రకారం సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్ రేంజ్‌‌లో జక్కన్న ప్లాన్ చేస్తున్నారట.

హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా SSMB29 ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారట. 2027 సంక్రాంతికి ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం భావిస్తోంది. ప్రీ లుక్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ సహా ప్రతీ టైంలోనూ ఈ మూవీ కోసం అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. దీంతో హైప్ మామూలుగా లేదు.

Also Read: ఇదేమైనా 9 నుంచి 5 గంటల వరకూ చేసే ఉద్యోగమా? దీపికా పదుకొనే షిఫ్ట్ టైమింగ్స్ వివాదంపై అడివి శేష్!

రాముడిగా మహేష్... టైటిల్ అదేనా?

ఈ మూవీపై మరో క్రేజీ బజ్ కూడా వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ అడవుల్లో ఓ సాహస యాత్ర బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా... విభిన్న కాలాల్లో రామాయణం, సంజీవని కూడా ఓ భాగం కానున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఎవ్వరూ చూడని ఓ అద్భుతాన్ని జక్కన్న ఆవిష్కరించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అడవుల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్, డైనోసార్స్ కూడా మహేష్ బాబును తరిమే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. కొన్ని సీన్స్‌లో మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారట. ఈ మూవీకి 'జెన్ 63' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.

120 దేశాల్లో...

ఈ మూవీని 120 దేశాల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా... 2 పార్టులుగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల కెన్యా మీడియా పేర్కొంది. తన ముందు మూవీస్‌లా కాకుండా ఓ డిఫరెంట్ స్ట్రాటజీని జక్కన్న ఈ మూవీ కోసం ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకూ మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. ఎలాంటి లీక్స్ లేకుండా హై సెక్యూరిటీ మధ్య షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు. 

ఈ ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, తమిళ స్టార్ ఆర్ మాధవన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.