Adivi Sesh Comments on Deepika Padukone: దీపిక పదుకొనే గతంలో షిప్ట్ టైమింగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. కారణంతోనే స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందనే ప్రచారం జరిగింది. విషయంలో సందీప్ వంగా - దీపిక మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది. అభిమానులు కూడా రియాక్టయ్యారు. దీపికా 8 గంటలు షిప్ట్ కావాలని అడిగారని..సందీప్ తిరస్కరించారని..వివాదం ఇక్కడే మొదలైందనే చర్చ జరిగింది. దీనిపై ఇండస్ట్రీవర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మూవీ నుంచి దీపిక తప్పుకోవడం తర్వాత అల్లు అర్జున్-అట్లీ మూవీకి సైన్ చేయడం కూడా జరిగిపోయింది. సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేస్తోందని అట్లీ హింట్ ఇచ్చాడు. దీపిక నటిస్తోందని కన్ఫామ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక సందీప్ వంగా కూడా దీపిక ప్లేస్ లో..యానిమల్ లో నటించిన త్రిప్తి దిమ్రిని ఫైనల్ చేశారు. అలా దీపిక తప్పుకోవడంతో ప్రభాస్ తో కలసి నటించే ఛాన్స్ కొట్టేసింది త్రిప్తి. దీపిక కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో భాగమైంది. ఎవరి వర్క్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. వివాదం గురించి అంతా పక్కనపెట్టేశారు కూడా. ఇలాంటి టైమ్ లో దీపిక అడిగిన పనిగంటల గురించి ప్రస్తావించాడు హీరో అడివి శేష్

ఇంటర్యూలో మాట్లాడుతూ... నటులు, నిర్మాతల మధ్య పనిగంటలకు సంబంధించి పరస్పర అవగాహన ఉండాలని ప్రస్తావించాడు. సందర్భంగా గతంలో దీపిక అడిగిన పని గంటల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు అడివి శేష్.

సినిమా ఇండస్ట్రీ అంటే రోజూ ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకూ చేసే ఉద్యోగం కాదన్నాడు.

సినిమా పరిశ్రమ సంప్రదాయ పని షెడ్యూల్‌లను పాటించదు.. “ఒక చిత్రనిర్మాత చిత్ర నటుల మధ్య ఏం మాట్లాడుకున్నారో, ఏం ఒప్పందం కుదిరిందో అదే ముఖ్యం అన్నాడు. సినిమాలకు, షూటింగ్స్ కోసం ప్రత్యేకంగా ఎటువంటి నియమం లేదు. ఎందుకంటే సినిమా 12 గంటలు తీస్తారు, 18 గంటలు తీస్తారు, 6 గంటలు తీస్తారు..కొన్నిసార్లు 24 గంటలు షూట్ చేయాల్సి వస్తుంది. అది ఎవరి ఇష్టం వారిది. 8 గంటలు, 6 గంటలు అని చెబితే అతిగా మాట్లాడినట్టు అవుతుంది..ఇదేం ఉద్యోగం కాదని స్పష్టంగా తన మనసులో మాట చెప్పేశాడు. అసలు షూటింగ్ వ్యవధికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవని శేష్ స్పష్టం క్లారిటీ ఇచ్చాడు. చిత్రీకరణ ప్రారంభించే ముందు కుదుర్చుకున్న అవగాహన మరియు ఒప్పందం చాలా ముఖ్యమని అన్నాడు.

దీపికా మాతృత్వం మాత్రమే కారణం కాదు

స్టార్టింగ్ లో దీపిక ఇలా కండిషన్స్ పెట్టలేదు కానీ తల్లైన తర్వాత ఇలా అభ్యర్థించిందా అన్న ప్రశ్నకు కూడా ఆలోచనాత్మకంగా స్పందించాడు అడివి శేష్. నా వరకూ ఇది పూర్తిగా మేకర్స్ - నటుల మధ్య కుదిరిన ఒప్పందంపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నా అని చెప్పాడు. ఆచరణాత్మకంగా అయితే ఇది వర్కౌట్ అవదు..షెడ్యూల్‌ కన్నా మరో 20 రోజులు ఎక్కువ అవసరం అయితే..అనుకోకుండా బడ్జెట్ అవసరం పడితే సర్దుబాటు ఎలా చేస్తారు? ఏదేమైనా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఉంటుంది ఏదైనా అని స్పష్టంగా చెప్పేశాడు.

ప్రస్తుతం అడివి శేష్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నాడు.షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న మూవీలో మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మూవీ తెలుగు, హిందీలో రూపొందుతోంది. అలాగే ఇమ్రాన్ హష్మీ , వామికా గబ్బితో కలిసి G2లో కూడా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినిడి దర్శకత్వం వహిస్తున్న G2 మూవీ 2026 మే 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కూడా నటిస్తున్నారు.