మేనల్లుడు అజయ్ దిషాన్ (Ajay Dhishan) హీరోగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ సినిమాకు 'పూకీ' (Pookie Movie) టైటిల్ ఖరారు చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా సేమ్ టైటిల్ ఖరారు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలుగులో ఆ పదానికి మీనింగ్ ఏంటి? బూతు అర్థం వచ్చే టైటిల్ పెట్టడం ఏమిటి? అని ప్రేక్షకులు మండిపడ్డారు. దాంతో టైటిల్ మారింది. (టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత ఎటువంటి వ్యతిరేకత వచ్చిందో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి - బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?)
'బూకీ'గా మారిన 'పూకీ'... టైటిల్ మారింది!తెలుగు ప్రేక్షకుల నుంచి వ్యక్తం అయిన విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ విజయ్ ఆంటోనీ దృష్టి వరకు వెళ్లినట్టు ఉంది. దెబ్బకు టైటిల్ ఛేంజ్ చేశారు. ఈ సినిమాకు 'బూకీ' టైటిల్ అనౌన్స్ చేశారు. తెలుగు ఆ పదానికి అర్థం లేదు. అయితే తమిళ్ డైలాగుల్లో 'పూకీ' అనే పదం ఎక్కువసార్లు రాసినట్టు ఉన్నారు. తెలుగులో డబ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఆ లిప్ సింక్ సెట్ అయ్యే, సౌండింగ్ వచ్చే పదం చూసి టైటిల్ మార్చినట్టు అర్థం అవుతోంది.
తమిళంలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకం మీద విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా విజయ్ ప్రొడ్యూస్ చేస్తున్న 'పూకీ' సినిమాను తెలుగులో సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకం మీద జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 8న పూజా కార్యక్రమంతో సినిమాను ప్రారంభించనున్నారు.
Also Read లిటిల్ హార్ట్స్ కలెక్షన్లు: రెండో రోజు డబుల్ ధమాకా... బాక్సాఫీస్ బరిలో దుమ్ము రేపిన చిన్న సినిమా
విజయ్ ఆంటోనీకి తమిళంతో పాటు తెలుగులో మార్కెట్ ఉంది. అది 'బిచ్చగాడు' విజయం వల్ల వచ్చినది. అందుకని, తన ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు తాను ప్రొడ్యూస్ చేస్తున్న 'బూకీ' సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ మ్యూజిక్ చేస్తున్నారు.
Also Read: అనుష్క సినిమాను బీట్ చేసిన కల్యాణి ప్రియదర్శన్ మూవీ... ఫస్ట్ డే కలెక్షన్లలో షాకింగ్ రిజల్ట్!