ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంటే ఆడియన్స్ అందరికీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ 5 (జీ టీవీ నెట్వర్క్), సోనీ లివ్, ఆహా, సన్ నెక్స్ట్, జియో ప్లస్ హాట్ స్టార్ (జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్) వంటివి గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న ఓటీటీలు. ప్రభుత్వం (భారత ప్రభుత్వం) నిర్వహిస్తున్న ఓటీటీ ఒకటి ఉందని తెలుసా?
వేవ్స్... ఇండియన్ గవర్నమెంట్ ఓటీటీ
వేవ్స్ అంటే ఇటీవల భారత ప్రభుత్వం నేతృత్వంలో జరిగిన వేవ్స్ సమ్మిట్ గుర్తు వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, నాగార్జున, అమీర్ ఖాన్ సహా ఎంతో మంది భారతీయ సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. అయితే... 'వేవ్స్' పేరుతో ఇండియన్ గవర్నమెంట్ ఓటీటీ కూడా లాంచ్ చేసింది.
భారత ప్రసార మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నడిచే 'ప్రసార భారతి' (దూరదర్శన్ - డీడీ ఛానల్) 'వేవ్స్' ఓటీటీని తీసుకు వచ్చింది. గత ఏడాది (నవంబర్ 2024)లో ఈ ఓటీటీని లాంచ్ చేసింది. అయితే... పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, తీవ్రవాదం మీద భారత్ కన్నెర్ర చేయడంతో పాటు ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు పాక్ సైనికుల దుశ్చర్యలను బలంగా తిప్పి కొడుతోంది. పాక్ ఆర్టిస్టుల కంటెంట్ కూడా బ్యాన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో మరోసారి గవర్నమెంట్ ఓటీటీ 'వేవ్స్'ను తెర మీదకు తీసుకు వచ్చింది.
వేవ్స్ ఎన్ని భాషల్లో ఉంది?
దీని సబ్‌స్క్రిప్షన్ రేటు ఎంత?
ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బంగ్లా, మరాఠీతో పాటు మొత్తం 12 భాషల్లో ఈ ఓటీటీ అందుబాటులో ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్‌ను 'వేవ్స్' ఓటీటీలో అందిస్తున్నామని దూరదర్శన్ ప్రతినిథులు తెలిపారు. సినిమాలతో పాటు టీవీ షోలు, రేడియో షోలు, గేమ్స్ వంటివి 'వేవ్స్'లో వీక్షకులకు అందుబాటులో ఉన్నాయి.
Also Read: '#సింగిల్' రివ్యూ: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ బావుందా? కామెడీ బావుందా?
Waves OTT Subscription: వేవ్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా తక్కువే. వీక్షకులు నెలకు 30 రూపాయలు కడితే చాలు... ఈ ఓటీటీలో కంటెంట్ అంతా చూడొచ్చు. అయితే రెండు డివైజ్‌లలో మాత్రమే చూడగలరు. క్వార్టర్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అయితే 85 రూపాయలు. అదీ రెండు డివైజ్‌లలో మాత్రమే చూసే వీలు ఉంటుంది. ఏడాదికి ఒకసారి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్టు అయితే 350 రూపాయలు కట్టాలి. ఇది డైమండ్ ప్లాన్. ఇందులోనూ రెండు డివైజ్‌లలో మాత్రమే అనుమతి ఉంటుంది. ఏడాదికి ప్లాటినమ్ ప్లాన్ తీసుకుంటే 999 రూపాయలు కట్టాలి. అప్పుడు నాలుగు డివైజ్‌లలో యాప్ యూజ్ చేయవచ్చు. 'వేవ్స్'లో కంటెంట్ ఫ్రీగా కూడా చూడొచ్చు. అయితే... అందులో డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండదు (Is Waves OTT app free or paid?).
How to login Waves OTT: ఫోన్ నంబర్ లేదా ఈ మెయిల్ అడ్రస్ ద్వారా 'వేవ్స్' ఓటీటీని సబ్‌స్క్రైబ్ కావచ్చ. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన షోస్, సినిమాలు ఈ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. దీనికి వీక్షకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Also Read: శుభం రివ్యూ: నిర్మాతగా సమంత మొదటి సినిమా - హారర్ కామెడీతో నవ్వించారా? భయపెట్టారా?