Ritu Varma's Devika & Danny Web Series Teaser Unvieled: యంగ్ హీరోయిన్, 'పెళ్లి చూపులు' ఫేం రీతు వర్మ ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్‌తో ముందుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు దేవికా & డానీ అనే టైటిల్ ఖరారు చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా.. మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ ఎలా ఉందంటే?
ఈ సిరిస్‌లో సూర్య వశిష్ట (Surya Vashistta), రీతు వర్మ (Ritu Varma) ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. 'శ్రీకారం' మూవీ ఫేం కిషోర్ రూపొందిస్తున్నారు. రీతు వర్మ ఓ స్కూల్ టీచర్‌గా కనిపించబోతున్నారు. హీరోను ఓ లారీ గుద్దే సీన్‌తో టీజర్ ప్రారంభం కాగా ఆసక్తి రేపుతోంది. ఇల్లు, స్కూల్ అంటూ తన పని తాను చేసుకుంటూ పోయే ఓ సాధారణ అమ్మాయికి ఓ అబ్బాయితో నిశ్చిరార్థం అవుతుంది.
ఇదే సమయంలో ఆ అమ్మాయి జీవితంలోకి లవ్ అంటూ మరో యువకుడు వస్తాడు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తాను ప్రేమించిన యువకుడి కోసం ఆ స్కూల్ టీచర్ ఏం చేసింది? అసలు ఆ యువకుడికి ఏమైనా గతం ఉందా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. టీజర్ ఆద్యంతం సస్పెన్స్‌తో కూడిన విధంగా ఉంది. 'ఊహించని విధంగా చిక్కుకున్న రెండు ఆత్మల కథ. ప్రేమకథలను రూల్స్ ప్రకారం ఉండాలని ఎవరు చెప్పారు?' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: సైనికుల కుటుంబ సభ్యులెవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు - ఆర్మీలో తండ్రి కోసం కమెడియన్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. జాయ్ ఫిల్మ్స్ సిరీస్ నిర్మించగా.. శివ కందుకూరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సూర్య వశిష్ట, సుబ్బరాజు, మౌనికా రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు జై క్రిష్ మ్యూజిక్ అందించారు.
రీతు వర్మ గతంలో మోడ్రన్ లవ్ హైదరాబాద్, మోడ్రన్ లవ్ చెన్నై వెబ్ సిరీస్‌ల్లో నటించగా.. ఇప్పుడు తాజాగా రొమాంటిక్, లవ్ జానర్ సిరీస్‌తో అలరించనున్నారు. ఎన్టీఆర్ 'బాద్ షా'తో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. కాజల్ చెల్లెలిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'నా రాకుమారుడు', 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాల్లో నటించారు. విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' సినిమాతో హిట్ కొట్టి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమె నటించిన 'మజాకా' మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు.