Viswaksen's Gangs Of Godavari OTT partner And Streaming Date Update: వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్. ఎన్నో హిట్ సినిమాలు అందించాడు. కామెడీ, మాస్.. జోన‌ర్ ఏదైనా త‌న‌దైన శైలిలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న న‌టించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' మే 31న ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే హైప్ క్రియేట్ అయ్యింది. టీజ‌ర్, ట్రైల‌ర్ అన్ని బాగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమా ఓటీటీకి కూడా మంచి క్రేజ్ వ‌చ్చింద‌ట‌. మూవీ ఓటీటీని పార్ట్‌నర్‌ని లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను ఫ్యాన్సీ రేటుకు డిజిటల్‌ రైట్స్‌ దక్కించుకుంది. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్ర‌క‌టించ‌నుంది. 


స్ట్రీమింగ్ ఎక్క‌డంటే? 


చాలా సినిమాలను రిలీజ్ కంటే ముందే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మంచి డీల్ కి కొనేస్తున్నాయి. సినిమాకి వ‌చ్చే హైప్, క‌థ న‌చ్చితే చాలు లాక్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్లో రన్‌ అవుతున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' ఓటీటీ అప్ డేట్ వ‌చ్చేసింది. రిలీజ్‌కు ముందే ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లాక్ చేసుకుంది. ఈ సినిమాని ఫ్యాన్సీ ప్రైజ్‌కి సొంతం చేసుకుందని సమాచారం. థియేట్రికల్‌ రన్‌ అనంతరం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో  స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే డిజిటల్ ప్రీమియర్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 


ఇప్ప‌టికే వ‌చ్చేసిన ట్విట్ట‌ర్ రివ్యూ.. 


ఈ మ‌ధ్య కాలంలో సినిమా రిలీజ్ అవ్వ‌డం ఆల‌స్యం ముందు రివ్యూలు వ‌చ్చేస్తున్నాయి. ఫ‌స్ట్ షో చూసిన ఆడియెన్స్ ట్విట్ట‌ర్ లో త‌మ అభిప్రాయాల‌ను చెప్పేస్తున్నారు. అమెరికాలో ప్రీమియ‌ర్ పూర్తైన వెంట‌నే రివ్యూలు బ‌య‌టికి వ‌చ్చేశాయి. విశ్వ‌క్ సేన్ అభిమానులు సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సినిమాలోని డైలాగులను పోస్ట్ చేస్తూ సినిమా బాగుందంటూ కితాబు ఇస్తున్నారు. ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యేసరికి 3.25 రేటింగ్ ఇస్తున్నారు. అయితే, ఇంకొంత‌మంది మాత్రం సినిమా పెద్ద‌గా న‌చ్చేలేదు అంటూ నెగ‌టివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఎడిటింగ్ బాలేద‌ని, ఎన్టీఆర్ చేసుంటే బాగుండేది అంటు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. 


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయ‌న స‌ర‌స‌న అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా న‌టించారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమాతో లిరిసిస్ట్ నుంచి డైరెక్టర్ గా మారారు కృష్ణచైతన్య. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి. చూడాలి ఓవ‌ర్ ఆల్ గా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో లేక బోల్తా ప‌డుతుందో. 


Also Read: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ - విశ్వక్ సేన్ మాస్, ఎవడైనా మీదకొస్తే పులిలా మీద పడిపోవడమే!