Latest OTT Releases: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల మల్టీ స్టారర్ యాక్షన్ డ్రామా ‘బడే మియా చోటే మియా’. భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ సినిమా పెద్ద‌గా రానించ‌లేదు. ప్రేక్ష‌కుల‌ను అంత‌గా మెప్పించ‌లేదు. మూవీపై నెగ‌టివ్ రివ్యూస్ వచ్చాయి. ఏప్రిల్ 11న హిందీ, తెలుగు భాష‌ల్లో రిలీజైన ఈ సినిమా రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. 


స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్క‌డ‌? 


‘బడే మియా చోటే మియా’ ఏప్రిల్ 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కాగా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. జూన్ 6న ‘బడే మియా చోటే మియా’ స్ట్రీమింగ్ అవుతుంద‌ని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించింది నెట్ ఫ్లిక్స్. అయితే, ఏ భాష‌ల్లో ఉంటుందో మాత్రం చెప్ప‌లేదు. 


కథేంటంటే.. 


ఇండియ‌న్ ఆర్మీకి సంబంధించిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఒక చోట నుంచి మరో చోటికి తరలిస్తుండగా ఒక ముసుగు మనిషి దాన్ని దొంగలిస్తాడు. ఆ తర్వాత 72 గంటల్లోనే భారత దేశాన్ని అంతం చేస్తానని ఆర్మీకి వీడియో మెసేజ్ పంపిస్తాడు. అతన్ని ఆపడానికి సైన్యం బయట వ్యక్తులు అవసరం అని కోర్టు మార్షల్ అయిన కెప్టెన్ ఫిరోజ్ అలియాస్ ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), కెప్టెన్ రాకేష్ అలియాస్ రాకీలని (టైగర్ ష్రాఫ్) తిరిగి రప్పిస్తారు. ఇంతకీ ఆ ముసుగు మనిషి తీసుకెళ్లిన టెక్నాలజీ ఏంటి? ఫ్రెడ్డీ, రాకీ దాన్ని కాపాడారా? ఈ మొత్తం కథలో కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? ఇలాంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఆక‌ట్టుకోని సినిమా.. 


బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒక‌టి ‘బడే మియా చోటే మియా’. కార‌ణం.. దాంట్లో న‌టించిన పెద్ద పెద్ద స్టార్స్. యాక్ష‌న్ జోన‌ర్ లో తెర‌కెక్కిన ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్ హీరోలు. ఇక ‘సలార్’లో రాజమన్నార్‌గా అలరించిన పృథ్వీరాజ్ సుకుమారన్ విల‌న్ గా న‌టించారు. వీళ్ల కాంబినేష‌న్ లో సినిమా ఒక రేంజ్ లో ఉంటుంద‌ని ఊహించారు. రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంద‌ని అనుకున్నారు. కానీ, అంచ‌నాలు తారు మారు అయ్యాయి. సినిమా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేపోయింది.


నెగ‌టివ్ రివ్యూలు రావ‌డంతో క‌లెక్ష‌న్లు కూడా ఢ‌మాల్ అని ప‌డిపోయాయి. క‌థ‌తో సంబంధం లేకుండా కేవ‌లం హై వోల్టేజ్ స‌న్నివేశాలు ఉండ‌టం, యాక్ష‌న్ ఎక్కువ‌గా క‌నిపించ‌డంతో ‘బడే మియా చోటే మియా’  ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఎక్క‌లేదు అని సినీ విశ్లేష‌కులు చెప్తున్నారు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలాయా ఎఫ్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.


అలీ అబ్బాస్ జాఫర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్సికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించారు. కాగా.. కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో పెద్ద‌గా రానించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ఓటీటీల్లో సూప‌ర్ హిట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. మ‌రి ఈ సినిమాని కూడా సినిమా ల‌వ‌ర్స్, యాక్ష‌న్ ల‌వ‌ర్స్ అలానే ఆద‌రిస్తారేమో చూడాలి మ‌రి. 


Also Read: సుక్కుతో స్టెప్పులు వేయించిన డ్యాన్స్ మాస్టర్ - ఈ లిరికల్ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా?