Bhairava and Bujji Prelude Series: ప్రస్తుతం ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్‌ 'కల్కి 2898 AD'. 'మహానటి' ఫేం నాగ్‌ అశ్విన్‌ పాన్‌ వరల్డ్‌గా‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. సుమారు రూ.500 కోట్ల నుండి రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక కల్కి మూవీ జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో 'కల్కి' టీం మూవీ ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేసింది. ఈ విషయంలో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఎక్కడ తగ్గడం లేదు.


మొన్న జరిగిన బుజ్జి ఇంట్రడక్షన్‌ ఈవెంట్‌ ఎంత గ్రాండ్ నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఇప్పుడు నాగ్ అశ్విన్ మరో సరికొత్త ప్లాన్ తో వచ్చాడు. ఇండియన్‌ మూవీ చరిత్రలోనే కల్కి మూవీని ప్రీల్యూడ్‌ పేరుతో యానిమేటేడ్‌ సిరీస్‌గా తీసుకువస్తున్నారు.  భైరవ అండ్‌ బుజ్జి పేరుతో ఈ సిరీస్‌ అమెజాన్‌లో విడుదల కాబోతుంది.  రిలీజ్‌కు ముందే భైరవ, బుజ్జిలను యానిమేషన్‌లో చూపించబోతున్నాడు ఈ విజనరి డైరెక్టర్‌. దీనికి ముహుర్తం కూడా ఫిక్స్‌ చేసి తాజాగా ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ సినిమా ప్రభాస్‌ భైరవ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భైరవకు హెల్ప్‌గా బుజ్జి ఉండబోతుంది. అదే బుజ్జి అంటే ఎవరో కాదు ఈ సినిమా ప్రభాస్‌ నడిపే కారు. సినిమాలో బుజ్జి పాత్ర కీలకం కానుంది. అందుకే అంత ప్రాధాన్యత ఉన్న ఈ రొబోటిక్ కారుని నేషనల్‌ వైడ్‌ పరిచయం చేస్తూ ప్రధాన నగరాల్లోని రోడ్లపై ప్రదర్శించేలా ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్‌. ప్రస్తుతం బుజ్జి చెన్నైలో ఉన్నట్టు సమాచారం.


ఇక ఈ సినిమాలో భైరవ, బుజ్జి బాండింగ్‌ని పరిచయం చేస్తూ 'కల్కి'ని యానిమేటేడ్‌ సిరీస్‌గా తీసుకువస్తుంది మూవీ టీం. దీనిని ప్రీల్యూడ్ పేరుతో మే 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైంలో స్ట్రీమింగ్‌ తీసుకువస్తున్నారు. అంతకంటే ముందు రేపు(మే 30) దేశంలోని ప్రధాన నగరాల్లోని థియేటర్లో ఈ ప్రీట్యూడ్‌ స్పెషల్‌ షోలు వేయబోతున్నారు. దీనిపై తాజాగా అమెజాన్‌ అధికారిక ప్రకటన ఇవ్వడమే కాదు తొలి ఎపిసోడ్స్‌ స్ట్రినింగ్‌ అయ్యే ప్రధాన నగరాలు, థియేటర్ల జాబితా కూడా విడుదల చేసింది. రేపు సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్‌ AMB Cinemas, ముంబై సినీపోల్స్‌, డీఎల్‌ఎఫ్‌ సాకేత్‌ ఢిల్లీ, బెంగళూరు ఓరియన్‌ మాల్‌లో ఒకేసారి స్క్రినింగ్‌ చేయబోతున్నారు.


ఇంటర్నేషనల్‌ వైడ్‌గా దుబాయ్‌లోని REEL Cinema - 3:15 PM, VUE Cinema Staines Londonలో 8PM ఇలా ఈ యానిమేటేడ్‌ సిరీస్‌ తొలి ఎపిసోడ్స్‌ను స్ట్రీనింగ్‌ చేయబోతున్నారట. ఇక ఇప్పిటికే విడుదలైన యానిమేటేడ్‌లో వచ్చిన ఈ టీజర్‌ పిల్లలను బాగా ఆకట్టుకునేలా ఉంది. టీజ‌ర్ పిల్లలు, భైర‌వ‌ను వెంబ‌డిస్తూ కనిపించారు. దీంతో అతడు వారికి స‌రైన స‌మాధానం చెప్పాల్సి వ‌స్తోంది. ఇందుకోసం భైరవ బుజ్జితో క‌లిసి ఏం చేసాడ‌న్నది పూర్తి వీడియో చూడాల్సిందే. టీజర్‌లో బుజ్జి & భైరవ యానిమేటెడ్ యాక్షన్ కట్ హైలెట్‌గా నిలిచింది. ఇది చూసి ఇక మూవీ ప్రమోషన్స్‌ విషయంలో నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ మామూలుగా లేదంటున్నారు ఆడియన్స్‌. ఇక ప్రీట్యూడ్‌ మూవీకి మరింత ప్లస్‌ అవుతుందంటున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌గా వస్తున్న ఈ సినిమాను యానిమేషన్‌లో చూపించడం ద్వారా పిల్లలు కూడా కనెక్ట్‌ అవుతారని, ఇది మూవీ ప్రమోషన్స్‌కి మరింత ప్లస్‌ అవుతుందంటున్నా సినీ విశ్లేషకులు. 


Also Read: ఐపీఎల్ అయిపాయే, ఇక సినిమాలు చూద్దామా? - థియేటర్లకు క్యూ కట్టిన చిత్రాలివే!