Abhignya Vuthaluru's Viraatapalem Series Trailer Released: అభిజ్ఞ, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్'. 'రెక్కీ' వంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'జీ5'లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
'జీ5' కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సిరీస్ రూపొందించగా.. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ హీరో నవీన్ చంద్ర ఈ ట్రైలర్ లాంచ్ చేశారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
1980ల నాటి మారుమూల భయానక గ్రామం 'విరాటపాలెం' చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. 'ఇప్పటివరకూ ఆ ఊరు వదిలేసి వెళ్లిన అమ్మాయిలని చూశాను కానీ.. ఆ ఊళ్లో ఉండడానికి వెళ్తున్న అమ్మాయిని నిన్నే చూశాను.' అంటూ ఓ బస్ కండక్టర్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా ఆసక్తి పెంచేస్తోంది. ఆ ఊర్లో పెళ్లి జరిగిన వెంటనే అమ్మాయిలు ఒక్కొక్కరుగా రక్త కక్కుకుని చనిపోతూ ఉంటారు. 'అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?' అంటూ లేడీ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ సాగుతున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు?, దెయ్యమా? లేక వేరే కారణమా? అనేది తెలియాలంటే సిరీస్ వచ్చే వరకూ ఆగాల్సిందే.
Also Read: ఒకే ఒక్క పోస్ట్.. అనేక అనుమానాలు - అభిషేక్ బచ్చన్ అలా ఎందుకు చేశారంటూ నెటిజన్ల చర్చ
'రెక్కీ' వెబ్ సిరీస్ తనకు చాలా ఇష్టమని.. డైరెక్టర్ కృష్ణ పోలూరు 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్'తో రాబోతున్నారని హీరో నవీన్ చంద్ర అన్నారు. 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్' పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ ట్రైలర్‌లో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ని కూడా టచ్ చేసినట్టు కనిపిస్తోంది.' అని అన్నారు.
రెక్కీ తర్వాత తాను చేసిన 'విరాటపాలెం' సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుదని డైరెక్టర్ కృష్ణ పోలూరు అన్నారు. 'జీ5లో ఇది వరకే ‘రెక్కీ’ చేశాను. అద్భుతమైన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ చేశాను. ఈ ప్రాజెక్ట్‌కి దివ్య కథను అందించారు. రెక్కీలానే ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది' అని అన్నారు.
ఈ సిరీస్ చేయడం తన అదృష్టమని హీరో చరణ్ అనగా.. మూఢ నమ్మకాల మీద పోరాడే స్టోరీ అద్భుతంగా ఉందని అన్నారు అభిజ్ఞ. ఇంత మంచి కథలను ఎంకరేజ్ చేస్తోన్న 'జీ5' టీంకు థాంక్స్ చెప్పారు. టీం అంతా కలిసి మంచి సక్సెస్ ఇవ్వబోతున్నామని నిర్మాత శ్రీరామ్ చెప్పారు. 'దివ్య చెప్పిన నెరేషన్ విన్న తరువాత నన్ను ఆ కథ నన్ను చాలా వెంటాడింది. అభిజ్ఞ సైతం ఈ కథ విన్న తరువాత చాలా ఎగ్జైట్ అయ్యారు. కృష్ణ కూడా ముందు ఈ ప్రాజెక్ట్‌లో లేరు. కానీ నా మాట కోసం ఆయన వచ్చి డైరెక్షన్ చేశారు. నా ఫ్రెండ్ ప్రవీణ్ ఈ ప్రాజెక్ట్ కోసం అన్నీ తానై పని చేశారు.' అని అన్నారు.