The Hunt Rajiv Gandhi Assassination Case Web Series OTT Release: దేశ చరిత్రలోనే ఓ విషాద ఘటన. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మర్డర్ కేసు.. హత్యపై జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రధానాంశంగా వెబ్ సిరీస్ రాబోతోంది. 35 ఏళ్ల కిందట జరిగిన షాకింగ్ ఘటనలో విచారణ జరిగిన తీరు.. 90 రోజుల్లోనే నిందితులను ఎలా పట్టుకున్నారనేదే 'ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్' సిరీస్‌లో చూపించనున్నారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కొలంబోలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా?' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మానవ బాంబు సిద్ధం కావడం.. వెనువెంటనే రాజీవ్ గాంధీ మర్డర్ జరిగిన న్యూస్ వస్తుంది. కేసును తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం మర్డర్ కేసు విచారణ కోసం సీఆర్పీఎఫ్ ఐజీపీ కార్తికేయన్ నేతృత్వంలో ఓ సిట్ ఏర్పాటు చేస్తుంది. దర్యాప్తు మొదలుపెట్టిన టీం కేవలం 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారనేదే ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారు.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'దేశాన్నే కుదిపేసిన హత్య. ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేసిన హంతకుల వేట. ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్.' అంటూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్‌కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించగా.. సాహిల్ వైద్, అమిత్ సియాల్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు.

Also Read: చిరంజీవి ‘చంటబ్బాయ్’, కీర్తి సురేష్ ‘మహానటి’ to రవితేజ ‘కృష్ణ’, అల్లు అర్జున్ ‘దేశముదురు’ వరకు - ఈ గురువారం (జూన్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

'ది హంట్' డైరెక్టర్ నగేష్ కుకునూర్ వెబ్ సిరీస్‌లతోనే పాపులర్ అయ్యారు. 1998లో 'హైదరాబాద్ బ్లూస్'తో దర్శకుడిగా పరిచయం కాగా.. ఇటీవలే సిటీ ఆఫ్ డ్రీమ్స్, మోడర్న్ లవ్ హైదరాబాద్ పేరుతో రెండు వెబ్ సిరీస్‌లు తీశారు. తాజాగా.. 'ది హంట్' సిరీస్ మళ్లీ ముందుకొస్తున్నారు. 1991, మే 21న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ.. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటుండగా.. మానవ బాంబు దాడిలో హతమయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కేసు విచారణను చేపట్టిన సిట్ బృందం రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకోవడం వంటి వాటిని ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అసలు రాజీవ్ గాంధీని ఎవరు చంపారు?, ఎందుకు చంపారు?, విచారణను ఎలా మొదలుపెట్టారు? అనే అంశాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.