Abhishek Bachchan's Kaalidhar Laapata OTT Release On Zee5: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల్లోపే కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని మూవీస్ ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా.. మరో బాలీవుడ్ మూవీ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే అందుబాటులోకి రానుంది.

బాలీవుడ్ స్టార్ సినిమా 'కాళిధర్ లాపత'

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కాళీధర్ లాపత'. ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. జులై 4 నుంచి ప్రముఖ ఓటీటీ 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి మధుమిత దర్శకత్వం వహించగా.. దైవిక్ భాగేలా, జీషన్ ఆయూబ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ నిర్మించారు.

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ఫస్ట్ పోస్టర్‌ను హీరో అభిషేక్ బచ్చన్ ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. 'కొన్నిసార్లు అన్నీ కోల్పోవడం కూడా మంచిదే. అక్కడి నుంచే అసలు స్టోరీ మొదలవుతుంది. ఎన్నో కలలు, మలుపుల మధ్య మనకు విలువ ఇచ్చే వ్యక్తులను కలుసుకుంటాం.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 'కరుపు దురై' అనే తమిళ మూవీకి ఈ సినిమా రీమేక్ కాగా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. 'హౌస్ ఫుల్ 5' మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అభిషేక్ బచ్చన్ ఈ మూవీతోనూ మంచి  విజయం అందుకోవాలని బావిస్తున్నారు.

Also Read: సమంతతో రాజ్ రిలేషన్ షిప్ రూమర్స్ - ఆయన సతీమణి లేటెస్ట్ పోస్ట్ వైరల్.. ఏం చెప్పారంటే?

అసలు స్టోరీ ఏంటంటే?

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో అనాథ పిల్లల చుట్టూ ఈ మూవీ రూపొందినట్లు తెలుస్తోంది. తన కుటుంబం తనను దూరం పెడుతుందని గ్రహించిన ఓ వృద్ధుడి చుట్టూ ఈ కథ సాగుతుంది. అలా కుటుంబాన్ని విడిచి వృద్ధుడు వెళ్తుండగా.. ఓ 8 ఏళ్ల అనాథ బాలుడు బల్లును కలుస్తాడు. ఆ తర్వాత ఆ వృద్ధుని జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇద్దరి అభిరుచులు కలిసి వారు సడన్‌గా రోడ్ ట్రిప్ ప్రారంభిస్తారు. అలా వెళ్లిన వారు అనేక అడ్వెంచర్స్ ఎదుర్కొంటారు. అసలు వారు ఎదుర్కొన్న సాహసాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేదే ఈ మూవీ స్టోరీ అన్నట్లు సమాచారం.

ప్రస్తుతం అభిషేక్ 'రాజా శివాజీ'లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రితేశ్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తుండగా.. జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కథగా ఇది రూపొందుతుండగా.. సంజయ్ దత్, మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.