సోలో బ్రతుకే సో బెటరు అని పాడుకునే యువతీ యువకుల శాతం మన భారతీయ సమాజంలో తక్కువ మంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నూటికి 99 శాతం మంది జీవితాల్లో పెళ్లి కామన్! అయితే... పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం కామన్ కాదు. అందరి జీవితాలు ఓకే విధంగా ఉంటాయని, ఉన్నాయని చెప్పలేం. అందుకే, పెళ్లి నేపథ్యంలో ఎన్ని కథలు వచ్చినా కొత్తగా ఉంటాయి. పెళ్లి చుట్టూ తిరిగే కథతో తెలుగులో కొత్త సినిమా రాబోతోంది. అదే 'విద్య వాసుల అహం'. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


ఆహా... భార్యాభర్తల మధ్య ఇగో!?
యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay), యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని (Shivani Rajasekhar) జంటగా నటించిన సినిమా 'విద్య వాసుల అహం' (Vidya Vasula Aham). ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ... అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని తమ ఓటీటీ వేదికలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు 'ఆహా' పేర్కొంది. త్వరలో ఈ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకు వస్తామని తెలియజేసింది.






'తెల్లవారితే గురువారం' ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. తమ సినిమా ఆహాలో విడుదల కానుండటం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.


''ఎవరెస్టు శిఖరంలో సగం... ఈ 'విద్య, వాసుల' అహం! ఆ కహనీ ఏంటో త్వరలో ఆహాలో చూద్దాం! త్వరలో 'ఆహా' ఓటీటీలో మాత్రమే 'విద్య వాసుల అహం' రిలీజ్ కానుంది'' అని తెలిపారు.


Also Read: భార్య ఎవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లను చంపేసే భర్త - నిజం తెలిశాక ఆమె ఏం చేస్తుంది?



Vidya Vasula Aham Movie Concept: కొత్తగా పెళ్లైన జంట 'విద్య వాసుల అహం' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆల్రెడీ టీజర్ విడుదల చేశారు. అందులో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ మధ్య షవర్ బాత్, లిప్ కిస్ వంటివి హైలైట్ అయ్యాయి. మరి, సినిమాలో వాళ్లిద్దరి మధ్య ఇగో క్లాష్ ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. అతి త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయలేదు.


Also Read: 3Dలో ‘RRR’ మూవీ - రీరిలీజ్ ఎప్పుడో తెలుసా? టికెట్స్ బుక్ చేసేసుకోండి మరి!



Vidya Vasula Aham Cast And Crew: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, వైవా రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అఖిల్ వల్లూరి, కూర్పు: సత్య గిడుతూరి, సహ నిర్మాతలు: రంజిత్ కుమార్ కొడాలి - చందన కట్ట, సంగీతం: కల్యాణీ మాలిక్, రచన: వెంకటేష్ రౌతు, కథనం, దర్శకత్వం: మణికాంత్ గెల్లి,నిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్, సమర్పణ: తన్విక జశ్విక క్రియేషన్స్, నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు - లక్ష్మీ నవ్య మక్కపాటి.