Sarkaar 4 Episode 6 PROMO: టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లవ్ మీ’. ‘బేబీ’ ఫేమ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్, హారర్, లవ్ మూవీగా తరూపొందుతున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి  లవ్‌ మీ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శిరీష్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా భారీగా అంచనాలు పెంచాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఆహా వేదికగా ప్రసారం అవుతున్న ‘సర్కార్’ షోలో చిత్రబృందం పాల్గొన్నది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. యాంకర్ సుధీర్ మీద మూవీ యూనిట్ వేసిన పంచులు అందరినీ ఆకట్టుకున్నాయి.


సుధీర్ పై రవి కృష్ణ పంచుల వర్షం


ప్రోమో ప్రారంభం కాగానే, ఆశిష్ ను ఉద్దేశించి 'మీరో వర్గానికి స్ఫూర్తి, దయ్యాన్ని ప్రేమించడం ఏంటండి?' అంటారు సుధీర్. 'నేను ప్రేమించిన దయ్యం. నా విజయావతి' అంటాడు ఆశిష్. ఇప్పుడు కూడా 'తను మీ పక్కనే ఉంది' అని చెప్పడంతో సుధీర్ ఆశ్చర్యపోతాడు. 'ఇవాళ నైట్ కు రమ్మనండి సర్' అంటాడు. 'వెంటనే మనిషివా? మానవ మృగానివా?' అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ రావడంతో అందరూ నవ్వుతారు. అప్పుడే వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి ఎంట్రీ ఇస్తారు. వారిని సుధీర్ 'ఈ సినిమా పేరేంటి' అని అడుగుతాడు. ‘లవ్ మీ ఇఫ్ యు డేర్' అంటారు. 'రియల్లీ ఐకాంట్' అంటూ సుధీర్ మెలికలు తిరిగిపోవడంతో షో నవ్వుల్లో మునిగిపోతుంది. ఇక అప్పుడే రవి కృష్ణ షోలోకి ఎంట్రీ ఇస్తాడు. 'ఈ ట్రైలర్ చూశావా?' అనడంతో 'చూశా' అంటాడు సుధీర్. 'ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు కొట్టారో తెలుసా?' అనగానే 'నువ్ కొట్టావా? డించిక్ డించిక్' అని తిరిగి ప్రశ్నిస్తాడు. 'నీ మ్యూజిక్ అంతా వేరు' అని రవి కృష్ణ అనడంతో ఎక్కడికెళ్లినా... 'అక్కడికి వెళ్లొద్ద'ని సుధీర్ అనడంతో అందరూ నవ్వుతారు. 'ఈ షోలో నిన్ను ఎలా కంట్రోల్ చేయాలంటే' అంటూ ‘విరూపాక్ష’ సినిమాలో మాదిరిగా మంత్రించిన నిమ్మకాయను సుధీర్ కు ఇస్తాడు రవి. 'దీన్ని బయటవేస్తే పోతావ్ అంటున్నారు?  విజయవతి దగ్గరికి వెళ్లిపోవచ్చా?' అనడంతో అందరూ నవ్వుతారు.


మగాళ్లను మనుషుల్లా చూశావా సుధీర్?- రవికృష్ణ


ఇక ఈ షోలో ప్రశ్నల కార్యక్రమం మొదలవుతుంది. ఓ ప్రశ్నకు రవికృష్ణ రూ. 500 పందెం కాస్తాడు. అవతల అమ్మాయి రూ. 10 వేలు పందెంకాసింది. మగాడివై ఉండి రూ. 500 కాస్తావా? అంటాడు సుధీర్. నువ్ ఏనాడైనా మగాళ్లను మనుషుల్లా చూశావా? అనడంతో అందరూ పడీపడీ నవ్వుతారు. ఈ షోలో ‘లవ్ మీ’ టీమ్ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ మే 24న ప్రసారం కానుంది ‘లవ్ మీ’ సినిమా మే 25న విడుదల కానుంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీత అందించారు.  



Read Also: విజయ్ దేవరకొండతో సుకుమార్ మూవీ- క్రేజీ అప్ డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్!