Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్

Unstoppable with NBK: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. దీని నాలుగో సీజన్ ఏపీ సీఎం చంద్రబాబు ఎపిసోడ్‌తో మొదలు కానుంది.

Continues below advertisement

తెలుగు ప్రజలకు, సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)లో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ (Aha OTT). ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అతి త్వరలో నాలుగో సీజన్ మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది. 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?

Continues below advertisement

ఏపీ సీఎం చంద్రబాబుతో 'అన్‌స్టాపబుల్ 4' మొదలు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎపిసోడ్‌తో 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలు కానుంది. ఆ ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరగనుంది. ఆయన్ను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ఈ షోలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే... అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏపీ సీఎం రావడం అయితే ఖరారు అయ్యింది. 

Unstoppable With NBK season 4 first episode: 'అన్‌స్టాపబుల్' షోలో ఇంతకు ముందు ఓసారి చంద్రబాబు వచ్చారు. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్ కూడా సీజన్‌ 2లో సందడి చేశారు. అప్పుడు ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు సీఎం హోదాలో ఆయన వస్తుండటం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో ఎన్నికలకు ముందు పరిస్థితులతో పాటు ఇప్పుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ వంటివి వివరించే అవకాశం ఉంది.

Also Readఎవరీ రియా? అసలు, ఈ అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అవుతుందో తెలుసా?


అల్లు అర్జున్... అలాగే 'లక్కీ భాస్కర్', 'కంగువ' టీమ్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం 'అన్‌స్టాపబుల్ 4'లో సందడి చేయనున్నారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ పూర్తి చేశారని సమాచారం అందుతోంది. అలాగే, ఈసారి ఇతర భాషలకు చెందిన హీరోలను సైతం షోకి తీసుకు వస్తున్నారు. మలయాళ స్టార్, తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన దుల్కర్ సల్మాన్ - కోలీవుడ్ స్టార్ సూర్య తమ తమ తాజా సినిమాల టీమ్స్ ద్వారా సందడి చేయనున్నారు.

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన తాజా పాన్ ఇండియా సినిమా 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar). ఆ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరోయిన్ మీనాక్షి చౌదరి సైతం పాల్గొన్నారట. ఈ నెల 24వ తేదీన 'కంగువ' (Kanguva) చిత్ర బృందంతో మరో ఎపిసోడ్ షూటింగ్ ప్లాన్ చేశారట. ఆ సినిమాల విడుదల సమయాల్లో ఎపిసోడ్స్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది.

Also Readఎవరీ ఆర్య... షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Continues below advertisement