Allu Arjun Kids Ayaan – Arha: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. షో మధ్యలో బన్నీ తల్లి నిర్మలతో పాటు బన్నీ ఫ్రెండ్ జాయిన్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ బోలెడు ఆసక్తికర విషయాలు చెప్పారు. చిన్నప్పుడు బన్నీ ఎలా ఉండేవాడు? ఎప్పుటి నుంచి మారాడు? అనే సంగతులను నిర్మల వివరించారు. ఇక తన సినీ కెరీర్ గురించి బన్నీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూకు పార్ట్ 2 కూడా ఉంటుందని బాలయ్య చెప్పారు. తాజాగా రెండో పార్ట్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది ఆహా టీమ్.
బాలయ్య షోలో ఐకాన్ స్టార్ పిల్లల సందడి
బన్నీ ఇంటర్వ్యూకు సంబంధించి పార్ట్ 2 ప్రేక్షకులను మరింత ఆకట్టుకోబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే ఫుల్ ఫన్నీగా అలరించనున్నట్లు అర్థం అవుతోంది. పార్ట్ 2 ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తో పాటు ఆయన పిల్లలు అయాన్, ఆర్హను బాలయ్య ఆహ్వానించారు. స్టేజి మీదికి రాగానే ఇద్దరు పిల్లలు బాలయ్య కాళ్లకు నమస్కరించి, తండ్రికి చెరో పక్కన కూర్చున్నారు.
తెలుగు పద్యంతో ఆకట్టుకున్న అర్హ
‘నీకు తెలుగు వచ్చా?” అని అడుగుతారు బాలయ్య. వెంటనే ఆమె ‘ప్రవరుని స్వగతం’ కథకు సంబంధించిన అత్యంత కఠినమైన..
’అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్’ అనే పద్యము చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పద్యం విన్న బాలయ్య చాలా సంతోషపడ్డారు. “తెలుగు పది కాలాల పాటు చల్లగా ఉంటుందనే ధైర్యం వచ్చింది” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
అయాన్ ‘యానిమల్’ సినిమాలో రణబీర్ టైపు!
ఇక “నాన్నకు నీకంటే చెల్లి మీదే ప్రేమ ఎక్కువ కదా?” అని అయాన్ ను అడుగుతారు బాలయ్య. అలా ఏం కాదని చెప్తాడు అయాన్. అల్లు అర్జున్ కలగజేసుకుని, ‘యానిమల్’ సినిమాలో రణబీర్ టైపు తను” అని చెప్తారు. నాన్నకు ఇబ్బంది కలుగుతుందంటే అస్సలు తగ్గడని చెప్తారు. ఈ మాట విని “ఐకాన్ స్టార్ కు అమ్మ మొగుడు అయ్యేలా ఉన్నాడు” అనడంతో “తగ్గేదే లే” అంటూ ‘పుష్ప’ సినిమాలోని తండ్రి మేనరిజం చేసి అందరినీ నవ్వించాడు అయాన్. మొత్తంగా వీళ్లిద్దరి అల్లరి ప్రేక్షకులను ప్రేక్షకుకులను బాగా అలరించబోతోంది. అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ అల్లరి చూసి ఎంజాయ్ చేయాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. నవంబర్ 22న ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన రెండో భాగం ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.