Panchayat Season 3: 'పంచాయత్ 3' - అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ఫ్రీగా చూడాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Panchayat 3 Streaming: 'పంచాయత్' వెబ్ సిరీస్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ యాప్‌లో ఆ సిరీస్ ఫ్రీగా చూడాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Continues below advertisement

Panchayat season 3 release date: 'పంచాయత్' వెబ్ సిరీస్ మూడో సీజన్ ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (యాప్)లో మే 28వ తేదీ (ఈ గురువారం) మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఫ్రీగా చూడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే, ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి మరి!

Continues below advertisement

ప్రైమ్ వీడియోలో 'పంచాయత్' ఫ్రీగా చూడాలంటే?
'పంచాయత్' వెబ్ సిరీస్ చూసిన తెలుగు వీక్షకుల సంఖ్య ఎక్కువే. ఒకవేళ దీని గురించి తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే... ఏప్రిల్ 2020లో 'పంచాయత్' వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎంతో మందికి వినోదం పంచింది. సిరీస్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా తీశారు. అది మే 2022లో రిలీజ్ అయ్యింది. కరోనా కాలంలో, ముఖ్యంగా లాక్ డౌన్ టైంలో ఇళ్లకు పరిచయమైన ప్రజలు చాలా మంది 'పంచాయత్' చూశారు. ఆ వీక్షకుల ఆదరణ, సక్సెస్ ఇప్పుడు మూడో సీజన్ రావడానికి కారణం అయ్యింది.

Latest web series on Amazon Prime: మే 28, 2024... ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన లేటెస్ట్ సిరీస్ 'పంచాయత్ 3'. ఒకవేళ మీకు గనుక ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఇప్పుడే ఈ సిరీస్ చూడవచ్చు. ఒకవేళ మీకు సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా పర్వాలేదు. ఫ్రీగా చూడవచ్చు. అందుకు మీరు చేయాల్సిన పని ఒక్కటే... 

అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కొత్తగా తీసుకునే యూజర్లకు ఈ ఓటీటీ వేదిక ఒక ఆఫర్ ఇస్తుంది. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్ యాక్సిస్ ఇస్తుంది. ఈ ఆఫర్ కావాలని కోరుకునే వీక్షకుల దగ్గర యాక్టివ్ క్రెడిట్ కార్డు ఉండటం తప్పనిసరి. ప్రీ పెయిడ్ క్రెడిట్ కార్డ్స్, ఇతర అకౌంట్స్ వ్యాలిడ్ కాదు. ఇంతకు ముందు యూజ్ చేసి, అన్ సబ్‌స్క్రైబ్ చేసిన మెయిల్ ఐడీ కూడా వ్యాలిడ్ కాదు. మీరు యూజ్ చేయబోయే ఐడీ సరికొత్తది అయ్యి ఉండాలి. అప్పుడే ఆఫర్ వస్తుంది.

Also Read: వచ్చే వారం నుంచి గురు, శుక్ర కాదు... 'జబర్దస్త్' టెలికాస్ట్ షెడ్యూల్ మారింది బాసూ!

ఒక్కసారి ఫ్రీ ఆఫర్ వాడిన తర్వాత నెలకు రూ. 299, మూడు నెలలకు రూ. 500 లేదంటే ఏడాదికి రూ. 1499 ప్లాన్ ఏదో ఒకటి తీసుకోవాలి.

Panchayat season 3 cast and crew: 'పంచాయత్'లో అభిషేక్ త్రిపాఠి పాత్రలో జితేంద్ర కుమార్ నటన, ఆయన పండించిన వినోదం సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. పంచాయతీ సెక్రెటరీగా చక్కటి నటనతో వీక్షకులు అందరినీ ఆకట్టుకున్నారు. ఆయనతో పాటు నీనా గుప్తా, శాన్విక, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్ ఇరత పాత్రలు పోషించారు. దీనికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకుడు. ది వైరల్ ఫీవర్ పతాకంపై అర్ణబ్ కుమార్, శ్రేయాన్శ్, పాండే, విజయ్ కోషీ ప్రొడ్యూస్ చేశారు.

Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు

Continues below advertisement