Telugu OTT Movies: థియేటర్లలో విడుదలైన మూడు, నాలుగు వారాల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సిల్వర్ స్ర్కీన్ మీద మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన మూడు హిట్ చిత్రాలు రేపు(ఏప్రిల్ 12న) స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


1.ప్రేమలు- ఏప్రిల్ 12న ‘ఆహా’లో స్ట్రీమింగ్


మలయాళంలో విడుదలై చక్కటి విజయాన్ని అందుకున్న మూవీ ‘ప్రేమలు’. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్లు సాధించి సరికొత్త రికార్డు సాధించింది.  మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా మార్చి 8న తెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘ప్రేమలు’ సినిమాలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నెల్సన్, మమితా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‍ లో కొనసాగుతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.   


2.గామి- ఏప్రిల్ 12న ‘జీ 5’లో స్ట్రీమింగ్


విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'గామి'. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి ప్రశంసలు దక్కించుకుంది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన జనాలు, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 'గామి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ'జీ 5' సొంతం చేసుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రాన్ని వీక్షకుల ముందుకు తీసుకు రానుంది. ఏప్రిల్ 12వ తేదీన డిజిటల్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది 'గామి'. ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించనగా, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ కీలక పాత్రలు పోషించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు.  


3. ఓం భీమ్ బుష్- ఏప్రిల్ 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్


శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. భారీ అంచనాలతో విడులైన ఈ సినిమా థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వచ్చిన కొద్ది రోజుల్లోనే 'టిల్లు స్క్వేర్' రావడంతో ఈ సినిమాకు ప్రేక్షకాదరణ తగ్గింది. ఈ నేపథ్యలో ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.   


Read Also: మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ అకౌంట్లో అంత డబ్బా? ఆకట్టుకుంటున్న ‘లక్కీ భాస్కర్’ టీజర్