Dulquer Salmaan’s Lucky Baskhar Teaser Out: మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. తెలుగులోనూ ఆయన పలు సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’తో పాటు డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నేరుగా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్  లో ఈ సినిమా రూపొందుతోంది.


డబ్బు చుట్టూ తిరుగుతున్న‘లక్కీ భాస్కర్’ కథ


ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే పీరియాడికల్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది. హీరో ఓ మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్. అతడి అకౌంట్ లోకి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. అంత డబ్బు అతడి అకౌంట్ లోకి ఎలా వస్తుంది? ఆయన వెనుక ఏమైనా కథ ఉందా? అనేలా ఆసక్తికరంగా ఈ టీజర్ ను కట్ శారు. మొత్తంగా ఈ టీజర్ డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీ కలిగిస్తోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది.



‘లక్కీ భాస్కర్’ సినిమాపై భారీ అంచనాలు


'సీతారామం' తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న రెండవ స్ట్రయిట్ తెలుగు ఫిలిం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై  మరింత క్యూరియసిటీ పెంచింది. మూవీ రిజల్ట్‌ తో సంబంధం లేకుండ దుల్కర్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమా చేస్తున్నారు. భాషతో సంబంధంగా లేకుండా బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌లో నటిస్తూ రియల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అనిపించుకుంటున్నారు. దుల్కర్‌ సినిమా అనగానే ఏదోక కొత్త పాయింట్‌, వైవిధ్యం ఉంటుందనేంతగా గుర్తింపు పొందాడు. దీంతో ఈ హీరో సినిమా అనగానే సినీ ప్రియుల్లో అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి కథతోనే ‘లక్కీ భాస్కర్‌’ అనే సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.  దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా మలయాళం లో 'కింగ్ ఆఫ్ కోథా' అనే సినిమాలో కనిపించారు. అటు తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి 'సార్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.


Read Also: కోలీవుడ్ హీరో విజయ్ దళపతి మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ‘ది గోట్’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన మేకర్స్!