The Greatest Of All Time to Release On September 5: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గోట్’(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ‘లియో’ సినిమా తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. సినిమా ఎప్పుడు చూడాలా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల


ఈ నేపథ్యంలో ‘ది గోట్’ చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషాల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొలి వారంలో విడుదల కావడంతో కేరళలో ఓనం సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వినాయక చవితి కూడా ఉండటంతో రెండు వారాల పాటు థియేటర్లకు పెద్ద మొత్తంలో ప్రేక్షకుల తాకిడి కనిపించే అవకాశం ఉంది. కేరళలో విజయ్ కి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఆయన సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.  






ఆకట్టుకుంటున్న ప్రమోషనల్ పోస్టర్లు


‘లియో’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. వాటిని అనుగుణంగానే చిత్రబృందం ప్రచారం మొదలు పెట్టింది. ప్రమోషనల్ పోస్టర్స్ తో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, టైటిల్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా సెకెడ్ లుక్ లో విజయ్ దళపతి రెండు లుక్స్ తో అలరించాడు. ఓవైపు ఓల్డ్ గెటప్, మరోవైపు యంగ్ గెటప్ తో కనిపించాడు. ఈ పోస్టర్ చూస్తుంటే, ఆయన ఈ సినిమాలో డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్లు అర్థం అవుతోంది. అంతేకాదు, వాళ్లు గన్ ఫైర్ చేసే విధానాన్ని హై యాక్షన్ తో తెరకెక్కుతున్న సినిమాగా తెలుస్తోంది.  


 ఇక ‘ది గోట్’ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


Read Also: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు