Rajamouli Dance Performance to Prabhudeva Song: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం. తెలుగు సినిమాను ఇంటర్నేషనల్‌ స్టేజ్‌పై నిలబెట్టిన ఘనత ఆయనదే. అంతేకాదు పాన్‌ ఇండియాను అంటూ సినీ ఇండస్ట్రీలో కొత్త పుంతలు వేశారు. ఇప్పుడు అదే బాటలోనే ప్రతి డైరెక్టర్‌ నడుస్తున్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో జక్కన్న మేకింగ్ స్టైల్‌, టేకాఫ్‌కి హాలీవుడ్‌ డైరెక్టర్స్‌ సైతం ఫిదా అయ్యారు. ఇక మూవీ తెరకెక్కించడంలో ఆయన పర్ఫెక్షన్‌ గురించి తెలిసిందే. మూవీ ప్రమోషన్స్‌లో ఆయనతో చేసిన హీరోలు చెప్పుతూ అదో పనీష్‌మెంట్‌ అంటారు. ఇవి బాహుబలి టైంలో ప్రభాస్‌, రానా.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టైంలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ల నోటి నుంచి వినిపించాయి.


సీన్‌లో పర్ఫెక్షన్ కోసం ఆయన ఎన్ని టేకులు తీసుకోవడానికైనా విసిగిపోరు. తన వర్క్‌ విషయంలో అంతగా డెడికేషన్‌ చూపించే జక్కన్న బయట మాత్రం చాలా ప్రెండ్లీ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్ మోస్ట్‌ డైరెక్టర్స్‌లో ఆయనదే ఆగ్రస్థానం. అయినప్పటికీ ఎదుటి డైరెక్టర్‌ చాలా గొప్ప అంటూ ఆయన నుంచి తాను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటూ ఒదిగి మాట్లాడతారు. ఇక షూటింగ్‌లకి బ్రేక్ దొరికితే ఎక్కువ ఫ్యామిలీతోనే గడుపుతారు. ఎక్కువగా వెకేషన్స్‌కి వెళ్లడం, ఇంట్లోనే ఫ్యామిలీతో సరదగా గడపడం చేస్తుంటారు. ఇక మూవీ విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా రాజమౌళిని ఇప్పటి వరకు డైరెక్టర్‌గానే చూసుంటారు. కానీ ఆయనలో ఓ మంచి డ్యాన్సర్‌ ఉన్నాడు. ఏ సినిమా ఈవెంట్లో అయినా సరదాగాకి కూడా కాలు కదపని జక్కన్న తాజాగా తన భార్యతో కలిసి రొమాంటిక్‌ స్టెప్పులు వేశాడు. అదీ కూడా ప్రభుదేవా పాటకి.






ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. డ్యాన్స్‌ పర్ఫెమెన్స్‌ కోసం రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ప్రభుదేవ, నగ్మా ప్రేమికుడు చిత్రంలోని 'అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే..' పాటకు ఆయన డ్యాన్స్‌ చేశారు. చూస్తుంటే ఇది ఫ్యామిలీ ఫంక్షన్‌ కోసమని తెలుస్తుంది. ఈ క్రమంలో పాటకు రిహారల్స్‌ చేస్తూ రాజమౌళి దంపతులు కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను బాగా ఆకట్టుకుంటుంది. జక్కన్న డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయనలో డైరెక్టరే కాదు మంచి డ్యాన్సర్‌ కూడా ఉన్నాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


స్టెప్స్‌లో ఆయన రిధమ్‌ చాలా బాగుందంటూ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా జక్కన్న ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29) మూవీ పనులతో బిజీగా ఉన్నారు. మహేష్‌ బాబు హీరోగా పాన్‌ వరల్డ్ ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కబోతుంది. యాక్షన్‌, అడ్వెంజర్‌ డ్రామా వస్తున్న ఈ మూవీ జేమ్స్‌ బాండ్‌ తరహాలో ఉండనుందని, ఇందులో చాలా వరకు హాలీవుడ్ నటీనటులే నటించే అవకాశం ఉందంటున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు జక్కన టీం.