The Kerala Story OTT Release Date: ఎన్నో ఆందోళనలు, మరెన్నో వివాదాలు. సినిమా ఆపేయాలని డిమాండ్లు. కానీ, వాటన్నింటిని తట్టుకుని, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో, సూపర్ హిట్ గా నిలిచింది ‘ది కేరళ స్టోరీ’. మే 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 16న ఈ సినిమాలో జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ5 అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. అదా శర్మ నటించిన ఈ సినిమాకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.
రిలీజైన ఆరు నెలలకు..
జనరల్ గా ఏ సినిమా అయినా రిలీజైన నెల లేదా రెండు నెలలకే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. కానీ, ‘ది కేరళ స్టోరీ’ మాత్రం దాదాపు ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. కాంట్రవర్సీలు, ఆందోళన నేపథ్యంలో ఈ సినిమా లేట్ అయ్యింది. ఇక ఉత్కంఠకు తెరపడింది.. ఫిబ్రవరి 16న వచ్చేస్తోంది అని జీ 5 ట్వీట్ చేసింది. ట్రైలర్ పోస్ట్ చేసి, ఆ వీడియోలో అభిమానులు చేసిన కామెంట్లు, వాళ్లు పెట్టిన మెసేజ్ లను కూడా డిస్ ప్లే చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
వివాదాల నడుమ..
కేరళలో కొంతమంది హిందూ అమ్మాయిలను లవ్ జిహాదీ పేరుతో మతం మారుస్తున్నారనే అంశంపై ఈ చిత్రాన్ని తీశారు. దీంతో ఈ సినిమా అప్పట్లో తీవ్ర వివాదాలకు దారి తీసింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, తదిర రాష్ట్రాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. కొంతమంది మాత్రం సినిమాని సపోర్ట్ చేశారు. వివాదాల మధ్య రిలీజైన ఈ సినమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం పరుగులు పెట్టింది. రూ.35 కోట్లతో తీసిన సినిమా ఏకంగా రూ.200 కోట్లు రాబట్టింది.
పొలిటికల్ టర్న్..
ఈ సినిమా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అది కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తే, ప్రతి పక్షాలు మాత్రం వ్యతిరేకించాయి. కొన్ని బీజేపీ రాష్ట్రాల్లో దీనిపై ట్యాక్స్ ఎత్తివేయగా... బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం ఈ సినిమా ప్రదర్శనపై ఆంక్షలు విధించాయి. పశ్చిమ బెంగాల్ ఏకంగా ఈ సినిమాపై బ్యాన్ విధించింది. తమిళనాడులోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు ఈ సినిమాని ప్రదర్శించ లేదు.
ఈ క్రమంలోనే సినిమాపై అప్పట్లో పొలిటికల్ గా పెద్ద యుద్ధమే జరిగింది. ఇక దీనిపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా కామెంట్స్ చేశారు. సినిమా టైటిల్ కింద ఇది నిజమైన కథ అని రాశారు. కానీ, నిజం అనే రాస్తే సరిపోదు. నిజంగా నిజం ఉండాలి అన్న కామెంట్స్ అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇక ‘ది కేరళ స్టోరీ’ సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.
Also Read: అంబానీ ఇంట పెళ్లి సందడి - రణబీర్, అలియా అలా సర్‌ప్రైజ్ చేస్తారట