Anant Ambani-Radhika Merchant's pre-wedding: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం అంబానీ కుటుంబం. ఇక ఆ కుటుంబంలో పెళ్లి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ప్రతీది వేడుకే, ప్రతీది స్పెషలే. వెడ్డింగే కాదు.. ప్రీ - వెడ్డింగ్‌ పార్టీని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏకంగా 8 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక ఆ ఫంక్షన్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌ స్పెషల్‌ పర్ఫామెన్స్‌ ఇవ్వబోతున్నారట. 

ఇప్పటికే గుజరాత్‌కి.. 

ముఖేష్అంబానీ చిన్నకొడుకు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌లకు పోయిన ఏడాది జనవరిలో నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వాళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 3న ఇద్దరూ అనంత్‌ అంబానీ రాధిక మెడలో తాళికట్టనున్నారు. ఇక ఈ పెళ్లికి సంబంధించి మార్చి 1 నుంచే ప్రీ - వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న అంబానీ ఇంట్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఆ వేడుకల్లో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌ ఇద్దరూ సందడి చేయనున్నారు. ఇద్దరు స్పెషల్‌ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ ఇవ్వనున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే రణ్‌బీర్‌, ఆలియా ఇద్దరూ గుజరాత్‌ చేరుకున్నారు. రిహార్సెల్స్‌ కోసం వాళ్లిద్దరూ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక ఆ ఇద్దరు గుజరాత్‌ నుంచి ముంబైకి చేరుకున్న విజువల్స్‌ కూడా బయటికి వచ్చాయి.  

వైరల్‌ అవుతున్న ఇన్విటేషన్‌.

అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లికి సంబంధించి అన్ని స్పెషల్‌గా డిజైన్‌ చేస్తున్నారు ఇరు కుటుంబాలు. దాంట్లో భాగంగానే వాళ్ల ప్రీ - వెడ్డింగ్‌ పార్టీ ఇన్విటేషన్‌ కూడా చాలా స్పెషల్‌గా ఉంది. ఆ ఇన్విటేషన్‌.. సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మార్చి 1 నుంచి పెళ్లి కార్యక్రమాలు మొదలవుతుండగా.. 8తో ముగియనున్నాయి. ఇక ప్రీ వెడ్డింగ్‌ పార్టీ మార్చి 1, 2, 3 తారీఖుల్లో జరగనున్నట్లు ఆ ప్రీ - వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌లో ఉంది. 

ఇన్విటేషన్‌ ఇలా.. 

"జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో మార్చి 1 నుంచి 3 వరకు జరిగే రాధిక అనంత్‌ల ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. 1997లో, రిలయన్స్ జామ్‌నగర్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్‌రూట్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించింది. చాలా ఏళ్లుగా.. ఆ ప్రాంతంలో 10 మిలియన్లకు పైగా చెట్లను నాటారు. రకరకాల చెట్లు, పువ్వులు, పండ్లతో ఆసియాలోనే అతిపెద్ద మామిడి తోటను కలిగి ఉంది. ఇక ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ అనంత్‌ ఈ కాంప్లెక్స్‌లో కొన్ని జంతువులను సంరక్షిస్తున్నాడు. గత 25 సంవత్సరాలుగా, మేము జామ్‌నగర్‌లో మా మధురమైన జ్ఞాపకాలను నిర్మించుకున్నాం. ఇది మా హృదయానికి దగ్గరగా ఉన్న ప్రదేశం. రాధిక, అనంత్‌ల వివాహ వేడుకల ప్రారంభోత్సవంలో మీరు మాతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలను హాజరు కావాలని కోరుతున్నాం. మీతో మా ఆనందాన్ని పంచుకోవడానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఇట్లు మీ నీతా అంబానీ , ముఖేష్అంబానీ" అంటూ ఆ ఇన్విటేషన్‌ని కొంతమంది ప్రముఖులకు పంపారు.

Also Read: అలీతో ఎవ్వరూ చేయనన్నారు, అలా అన్నవాళ్లనే సినిమా నుంచి తీసేశా.. హిట్‌ కొట్టా: ఎస్వీ కృష్ణారెడ్డి