S. V. Krishna Reddy About Yamaleela Movie: ఫ్యామిలీ సెంటిమెంట్‌ సినిమాలు అంటే ఎవర్‌గ్రీన్‌ సినిమాలు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆ సినిమాలు సూపర్‌హిట్టే. అలాంటి ఎన్నో సూపర్‌ డూపర్‌హిట్‌ సినిమాలు అందించిన డైరెక్టర్‌ ఎస్వీ.కృష్ణారెడ్డి. సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేశారు ఆయన. అలా కమెడియన్‌ అలీని హీరోగా పెట్టి 'యమలీల' సినిమా తీశారు. అది సూపర్‌హిట్‌ అయ్యింది అప్పట్లో. కాగా.. ఆ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎస్వీ కృష్ణారెడ్డి. 


"అలీతోనా? నో" అన్నారు.. చేయొద్దు అన్నాను


తాజాగా ఒక య్యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి. " 'యమలీల' సినిమా చేస్తున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఫోన్లు చేసి.. "మేం ఉన్నాం కదయ్యా ఎందుకు అలీని పెట్టి తీయడం" అని అన్నారు. కానీ, నేను మాత్రం అలీతో మాత్రమే ఈ సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాను. అలీని పిలిచి నువ్వే హీరో అనగానే ఆశ్చర్యపోయాడు. 15 రోజులు షూటింగ్‌.. రూ.50,000 రెమ్యునరేషన్‌ అని చెప్పాను. ఆ తర్వాత సౌందర్యాను హీరోయిన్‌గా అనుకుని ఆమెను అడిగితే.. "పెద్ద పెద్ద హీరోలతో ఛాన్స్‌లు వస్తున్నాయి అండి.. అలీ పక్కన నేను చేయలేను" అని చెప్పేశారు. నో ప్రాబ్లమ్‌ వదిలేయండి అన్నాను. ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు ఫోన్‌ చేసి "అలీ పక్కన నేను ఏంటయ్య?" అన్నారు.. చెయ్యకండి వేరేవాళ్లను చూసుకుంటాను అన్నాను. అలా తోటరాముడి క్యారెక్టర్‌కి తణికెళ్లభరణిని సెట్‌ చేశాను. ఇక ఇంద్రజను కూడా రాత్రిపూట షూటింగ్‌ జరుగుతుంటే.. చిన్న చిన్న లైట్‌ వెలుతురులో చూసి ఓకే చేశాను. ఇప్పుడు ఆ సినిమానే బంపర్‌హిట్ అయ్యింది" అని చెప్పారు కృష్ణారెడ్డి. 


కథ మీద నమ్మకం.. కథలో కొత్తదనం ఉండాలి


అంతమంది రిజెక్ట్‌ చేసినా, అంతమంది వద్దని చెప్పినా తాను కావాలనే అలీతో సినిమా తీశానని అన్నారు కృష్ణారెడ్డి. కారణం.. కథ మీద ఉన్న నమ్మకం, కథలో ఉన్న కొత్తదనం తనను ముందుకు నడిపిస్తుందని అన్నారు. కొత్తదనాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదిరిస్తారని, సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం ఆదరించరు అని కామెంట్‌ చేశారు ఆయన. " సూపర్‌హిట్‌ సినిమాలో ఆ సీన్‌ ఇలానే ఉంటుంది. అది ఉంటే మన సినిమా కూడా హిట్టే అనుకుంటారు. కానీ కొత్తదనం ఉండాలి. ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి అప్పుడే సక్సెస్‌ అవుతారు డైరెక్టర్‌. ఇప్పుడు వస్తున్న వాళ్లకి కూడా నేను అదే చెప్తాను. కాన్ఫిడెన్స్‌ ఎవరినైనా, ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది" అని తన అనుభవాలను పంచుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.  


చిన్నవేషం కావాలని సౌందర్య అడిగారు.. 


'యమలీల' రిజెక్ట్‌ చేసిన సౌందర్య తానే స్వయంగా వచ్చి "మీ సినిమాలో చిన్న వేషం ఉన్నా చేస్తాను అండి" అని అడిగింది. దానికి నేను ఆలోచించి చెప్తాను అమ్మ అని చెప్పాను. ఆ తర్వాత అందుకే, బాబు మోహన్‌తో పాట ప్లాన్‌ చేశాను. "బాబు మోహన్‌ పక్కన చేయాలమ్మ" అని అన్నాను.. వెంటనే ఓకే చెప్పారు సౌందర్య. "ఒకసారి తప్పు చేశాను.. ఇప్పుడు ఆ తప్పు చేయను" అని సౌందర్య అన్నారని చెప్పారు ఎస్వీ కృష్ణారెడ్డి. "నన్ను నమ్మి వస్తే.. కచ్చితంగా సక్సెస్‌ ఇస్తాను, ఆ కాన్ఫిడెన్స్‌ నాకు ఉంది. దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. దాన్ని నమ్ముతాను కాబట్టే నా సినిమాలు నేను ప్రొడ్యూస్‌ చేసుకున్నాను. ఎవ్వరినీ ఇబ్బందిపెట్టాలి అనుకోలేదు" అంటూ తన సినిమా కెరీర్‌ గురించి చెప్పారు ఎస్వీ కృష్ణారెడ్డి. 


Also Read: కాల్‌సెంటర్‌ వాళ్లనీ వదిలిపెట్టని సోహెల్‌, సినిమా ప్రమోషన్‌ చేయమని రిక్వెస్ట్‌.. వీడియో వైరల్