Manoj Bajpayee's The Family Man 3 Series Trailer Out : బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్ అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 నుంచి ట్రైలర్ వచ్చేసింది. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అంతకు మించి థ్రిల్ పంచేందుకు మూడో సీజన్ కూడా రెడీ అయిపోయింది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్ (TASK) సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ అదరగొట్టారు. ఫస్ట్ ఓ కామెడీ కాన్వర్షేషన్‌తోనే ట్రైలర్ ప్రారంభం కాగా... ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. 'నేను ఓ ఏజెంట్' అంటూ తన కొడుక్కి శ్రీకాంత్ చెప్పగా... ట్రావెల్ ఏజెంటా? అని ప్రశ్నిస్తాడు. కాదు బేటా స్పై ఏజెంట్ అంటూ సీక్రెట్ రివీల్ చేస్తాడు. ఈ క్రమంలో తివారీపైనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడం సస్పెన్స్ క్రియేట్ చేసింది.
ఓ సస్పెక్ట్‌గా మారిన శ్రీకాంత్ తన ఫ్యామిలీతో సహా వేరే ప్రాంతానికి వెళ్లేందుకు యత్నిస్తాడు. దీని వెనుక ఏదో పెద్ద గేమ్... బిగ్ ప్లాన్ ఉంది అంటూ ఎలివేషన్ ఇవ్వడం హైప్ ఇస్తోంది. అసలు ఆఫీసర్ శ్రీకాంత్ ఎందుకు సస్పెక్ట్ అయ్యాడు? అతని కోసం పోలీసులతో పాటు గ్యాంగ్ ఎందుకు వెతుకుతుంటారు? చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ ఎందుకు భయపడ్డాడు? అతనికి ఎదురైన సవాళ్లేంటి? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : SSMB29 నుంచి సడన్ సర్‌ప్రైజ్ - ఎవరూ ఊహించని క్రూరమైన 'కుంభ'... పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వేరే లెవల్
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌లోనూ అందుబాటులోకి రానుంది. సిరీస్‌ను డీ2 ఫిల్మ్ బ్యానర్‌లో రాజ్ డీకే రూపొందించగా... మనోజ్‌తో పాటు ప్రియమణి, అశ్లేష ఠాకూర్, జేకే తల్పాడే, శరద్ ఖేల్కర్, సందీప్ కిషన్, శ్రేయా ధన్వంతరి, గుల్‌పనాగ్, సన్నీ హిందూజా, అభయ్ వర్మలు కీలక పాత్రలు పోషించారు. 2019లో వచ్చిన ఫస్ట్ సీజన్, 2021లో వచ్చిన సెకండ్ సీజన్ ట్రెండింగ్‌గా నిలిచాయి. పాకిస్థాన్, శ్రీలంకలో టెర్రరిజం బ్యాక్ గ్రౌండ్‌లో ఫస్ట్ రెండు సీజన్స్ రాగా... ఇప్పుడు మూడో సీజన్ సరికొత్త స్టోరీతో రాబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.