Sudheer Babu's Jatadhara OTT Platform Locked : టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు చాలా రోజుల తర్వాత సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుప్త నిధులు, ధన పిశాచి బంధనం, సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌తో ఎవరూ ఊహించని స్టోరీతో ఆడియన్స్‌కు థ్రిల్ పంచేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా... ఓటీటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Continues below advertisement


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?


ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'Zee5' సొంతం చేసుకుంది. బిగ్ డీల్‌కు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక శాటిలైట్ రైట్స్ జీ టీవీ, జీ సినిమాలు సొంతం చేసుకోగా... ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయిన తర్వాత టీవీల్లోకి వస్తుందా? లేదా ఒకేసారి అటు ఓటీటీ ఇటు టీవీల్లో ప్రీమియర్ అవుతుందా? అనేది తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.


Also Read : మీ వెయిట్ ఎంత? - జర్నలిస్ట్ ప్రశ్నకు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్... సింగర్ చిన్మయి అమేజింగ్ రియాక్షన్


ఈ మూవీలో సుధీర్ బాబు శివగా ఘోస్ట్ హంటర్‌గా నటించాడు. ఇక ధన పిశాచిగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించారు. ఆమెకు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. వెంకట్ కల్యాణ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... యాంకర్ ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రైన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ చేశారు.