Priyadarshi's Mithra Mandali New Edited Version OTT Streaming On Amazon Prime Video : టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'మిత్ర మండలి'. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది.

Continues below advertisement

న్యూ వెర్షన్...

ఈ మూవీ న్యూ ఎడిటెడ్ వెర్షన్‌ సరికొత్తగా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ కొత్త వెర్షన్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది. మూవీకి ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహించగా... ప్రియదర్శి, నిహారికలతో పాటు రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహర, సత్య, వెన్నెల కిశోర్ వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. ఆర్ ఆర్ ధృవన్ మ్యూజిక్ అందించారు. నిహారిక, విజయేంద్రలకు ఇదే ఫస్ట్ మూవీ. ఫేమస్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ సమర్పణలో... సప్తాశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Continues below advertisement

Also Read : ముదిరిన 'మంగళ సూత్రం' వివాదం - ట్విట్టర్‌లో రచ్చ... సింగర్ ట్వీట్‌పై సీపీ సజ్జనార్ రియాక్షన్

స్టోరీ ఏంటంటే?

జంగ్లీ పట్నానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్)కు కులం అంటే పిచ్చి. తన కులం వారినే అందలం ఎక్కిస్తాడు. ఏ పనైనా చేసి పెడతాడు. వేరే కులం వ్యక్తి రక్తం అయినా ఎక్కించుకునేందుకు ఆలోచిస్తాడు. అలా తన కులం బలంతో ఎమ్మెల్యే కావాలని కలలు కంటాడు. అయితే, ఇదే టైంలో నారాయణ కుమార్తె స్వేచ్ఛ (నిహారిక) ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు, పొలిటికల్ కెరీర్ పోతుందని భావించిన నారాయణ... ఎలాంటి కేసు పెట్టకుండా ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయంతో వెతుకులాట ప్రారంభిస్తాడు.

స్వేచ్ఛ పారిపోవడం వెనుక అదే ప్రాంతానికి చెందిన యువకులు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయ్), రాజీవ్ (ప్రసాద్ బెహర)ల హస్తం ఉందని తెలుస్తుంది. అసలు స్వేచ్ఛ ఇంటి నుంచి పారిపోవడానికి కారణం ఏంటి? ఆమె ఎవరిని ప్రేమించింది? స్వేచ్ఛ వల్ల ఈ నలుగురు యువకులు పడ్డ ఇబ్బందులేంటి? ఎమ్మెల్యే కావాలనుకున్న నారాయణ కల నెరవేరిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.