Mithra Mandali OTT Release Date: ప్రియదర్శి పులికొండ కథానాయకుడిగా వచ్చిన తాజా సినిమా 'మిత్ర మండలి'. పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారికా ఎన్ఎమ్ తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయమైన చిత్రమిది. థియేటర్లలో ఆశించిన స్పందన రాలేదు. దాంతో త్వరగా ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు.
థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు!అక్టోబర్ 16న 'మిత్ర మండలి' థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా గనుక నచ్చకపోతే తన తర్వాత సినిమా చూడొద్దని ప్రియదర్శి బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి టాక్ బాలేదు. అది కారణమా? లేదంటే మరొకటా? అనేది తెలియదు గానీ... థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు ఓటీటీలోకి సినిమా వస్తోంది.
'మిత్ర మండలి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 6వ తేదీ నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో పేర్కొంది.
అసలు 'మిత్ర మండలి' సినిమా కథ ఏమిటి?కుల వివక్ష, ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమా!'మిత్ర మండలి' కథ అంతా ఒక ఫిక్షనల్ ఏరియా జంగ్లీ పట్నంలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో తుట్టె కులం ప్రజలు ఎక్కువ. ఆ కులానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్) తనను తాను తుట్టె కులం పులిబిడ్డగా పేర్కొంటాడు. తన కులం అండ దండలు తనకు పుష్కలంగా ఉండటంతో ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. అయితే... నారాయణ కుమార్తె స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్) ఓ అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మాయి లేచిపోయిందని కాకుండా కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్‌కు వెళతాడు నారాయణ.
స్వేచ్ఛ మిస్సింగ్ కేసులో చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు ఓయ్), అభి (రాగ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నారని పాత్ర ఏమిటి? ఆ నలుగురు స్నేహితులు ఎవరు? వాళ్లలో ఎవరిని స్వేచ్ఛ ప్రేమించింది? ఆమెను ఎవరు ప్రేమించారు? ఆమె కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ కేసును సాల్వ్ చేయడంలో పోలీస్ (వెన్నెల కిశోర్)కు ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ఏ విధంగా సాయపడ్డాడు? అనేది సినిమా.
Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?
బీవీ వర్క్స్ బ్యానర్ పతాకంపై 'బన్నీ' వాస్ సమర్పణలో విజయేందర్ దర్శకత్వంలో సప్తాస్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల 'మిత్ర మండలి' చిత్రాన్ని నిర్మించారు. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.