Varsha Bollamma's Constable Kanakam Web Series Season 2 OTT Release : 'వేర్ ఈజ్ చంద్రిక'... రీసెంట్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన స్టోరీ లైనప్. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' ఫస్ట్ సీజన్ ఎంత హైప్, సస్పెన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. 'వేర్ ఈజ్ చంద్రిక' అనే క్వశ్చన్‌కు ఆన్సర్ దొరకబోతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ సీజన్ 2 వచ్చే నెలలో రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మరింత థ్రిల్, మిస్టరీతో కొత్త సీజన్ రాబోతున్నట్లు తెలిపారు. 'కానిస్టేబుల్ కనకం సిరీస్‌ను ఇంత సక్సెస్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతీ వ్యూ, ప్రతీ మెసేజ్, 'వేర్ ఈజ్ చంద్రిక' అనే క్వశ్చన్. ఇలా ప్రతీది ఈ ప్రయాణాన్ని మాకు మరింత స్పెషల్ చేసింది. కానీ కథ ఇంకా ఎండ్ కాలేదు. కాస్త వెయిట్ చేయండి. రెట్టింపు థ్రిల్, మిస్టరీ, ఎమోషన్స్‌తో సీజన్ 2 వచ్చే నెలలో వస్తుంది. తుపానుకు సిద్ధంగా ఉండండి.' అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఫస్ట్ సీజన్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించగా... రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సిరీస్‌ను నిర్మించారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ది రాజా సాబ్' రిలీజ్ రూమర్లకు చెక్... ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
సీజన్ 1 స్టోరీ ఏంటంటే?
ఈ సిరీస్ సీజన్ 1లో 6 ఎపిసోడ్స్ ఉండగా... ఆద్యంతం థ్రిల్, హారర్, మిస్టరీ అంశాలు ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. 1998 ప్రాంతంలో ఓ గ్రామంలో జరిగే క్రైమ్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సిరీస్ రూపొందించారు. శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామ సమీపంలో అడవిగుట్ట వైపు వెళ్లే అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. దీంతో పోలీసులు, ఆ ఊరి ప్రెసిడెంట్ (అవసరాల శ్రీనివాస్) అటు వైపు ముఖ్యంగా రాత్రి పూట ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయిస్తారు. అయితే, పొరపాటున అటుగా వెళ్లిన ముగ్గురు మహిళలు కనిపించకుండా పోతుంటారు. దీంతో పోలీసులు వారిని వెతికే పనిలో పడతారు. అమ్మాయిల మిస్సింగ్‌తో గ్రామస్థులు ఆందోళన చెందుతుంటారు.
ఇక అదే గ్రామానికి కానిస్టేబుల్‌గా వస్తుంది కనకం (వర్ష బొల్లమ్మ). ఆ ఊరికి వస్తున్న టైంలో పరిచయమైన చంద్రిక (మేఘలేఖ) మంచి ఫ్రెండ్‌గా మారుతుంది. ఓ రోజు జాతర కోసం కనకం, చంద్రిక బయటకు వెళ్లగా బైక్ ప్రమాదమై ఆ తర్వాత చంద్రిక మిస్ అవుతుంది. దీంతో ఆ కేస్ ఎవరి సహకారం లేకపోయినా ఇన్వెస్టిగేట్ చేస్తుంది కనకం. అసలు అడవిగుట్టలో ఏం జరుగుతోంది? చంద్రిక ఏమైంది? అమ్మాయిలు ఎందుకు మిస్ అయ్యారు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.