Singer Chinmayi Reaction On Harassement Issue : సింగర్ చిన్మయిపై సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ రీసెంట్‌గా తాళిపై చేసిన కామెంట్స్ వ్యవహారంలో ఈ దంపతులపై ట్రోలింగ్ సాగగా... ఆమె రియాక్ట్ అయ్యారు. తనపై వేధింపుల కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీ సజ్జనార్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన సజ్జనార్ సంబంధిత పోలీసుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు.

Continues below advertisement

అసలేం జరిగిందంటే?

'అందాల రాక్షసి'తో హీరోగా టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్... ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా... మరోవైపు డైరెక్టర్‌గానూ సత్తా చాటుతున్నారు. రీసెంట్‌గా నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీని తెరకెక్కించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తాళిపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. 'నా భార్య తాళి మెడలో వేసుకోవాలా వద్దా అనేది ఆమె ఇష్టమే. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏమీ ఉండదు. ఇది ఓ వివక్షే. మగవారికి లేని  కండీషన్ మహిళలకు ఎందుకు?' అని కామెంట్ చేశారు.

Continues below advertisement

ట్రోలింగ్స్ మామూలుగా లేవు

ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొందరు నెటిజన్లు సపోర్ట్ చేయగా, మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. రాహుల్, చిన్మయి కపుల్‌ను ఏకి పారేశారు. దీనిపై రియాక్ట్ అయిన చిన్మయి... 'ఆయన ఏదో ఓ సందర్భంలో అలా మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న చర్చపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనదేశంలో మహిళల గురించే ఆందోళన చెందుతున్నా.' అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చారు.

ఓ నెటిజన్ వైరముత్తు ఎపిసోడ్‌పై చిన్మయిని ప్రశ్నించాడు. 'అతని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు. మిగిలిన మహిళల గురించి ఆందోళన చెందుతున్నారు.' అంటూ సెటైరికల్‌గా క్వశ్చన్ చేశాడు. దీనికి స్పందించిన చిన్మయి... 'అవును... లైంగిక వేధింపులకు గురి కావడం నా తప్పే. కానీ మీలాంటి పురుషులు నా లైంగిక వేధింపుల ఎపిసోడ్ గురించి ఎందుకు ప్రస్తావించాలి? దయచేసి ఢిల్లీ గాలిని పీల్చుకోండి. ఎందుకంటే నేను అలాంటి గాలి తట్టుకోలేను.' అంటూ ఇచ్చి పడేశారు. 2018లో మీటూ ఉద్యమం టైంలో ఓ ఈవెంట్‌లో వైరముత్తు తనను వేధించాడంటూ చిన్మయి ఆరోపించారు.

Also Read : కమల్ రజినీకాంత్ మూవీ షురూ - 28 ఏళ్ల తర్వాత 'అరుణాచలం' హిట్ కాంబో

సజ్జనార్‌ దృష్టికి

సోషల్ మీడియాలో ట్రోలింగ్, కామెంట్స్ విపరీతంగా సాగడంతో ఈ వ్యవహారాన్ని సింగర్ చిన్మయి సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. 'దయచేసి దీన్ని చూడండి సార్. నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణలో మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. వారికి ఏదైనా అభిప్రాయం నచ్చకపోతే వదిలేసి వెళ్లిపోవచ్చు. ఈ పురుషులు ప్రాథమికంగా నా పిల్లలు చనిపోవాలని చెబుతున్నారు. నేను కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ కేసు 15 ఏళ్లు పట్టినా చట్టం తన పని తాను చేసుకోనివ్వండి.' అంటూ రాసుకొచ్చారు.

సజ్జనార్ రియాక్షన్

దీనికి సజ్జనార్ రియాక్ట్ అవుతూ సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. దీంతో ఆయనకు థాంక్స్ చెబుతూ చిన్మయి ట్వీట్ చేశారు. 'సోషల్ మీడియాను ఇలా వాడుతున్న వారికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టండి సార్' అంటూ రిక్వెస్ట్ చేశారు.