SSMB29 Priyanka Chopra: సూపర్ స్టార్ మహేష్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న SSMB 29 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB 29 సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ఈ నెల 15న రాజమౌళి రివీల్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహేష్‌బాబు అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న నటి ప్రియాంకా చోప్రా కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. వీటిని ఆమె అభిమానులతోపాటు మహేష్‌బాబు అభిమానులు షేర్ చేస్తున్నారు. లైక్స్ చేసి కామెంట్స్ పెడుతున్నారు.
ప్రియాంకా హైదరాబాద్ ఫోటోలు షేర్ చేసింది
నటి ప్రియాంకా ఇన్‌స్టా స్టోరీలో హైదరాబాద్ రోడ్లపై వెళ్తూ తీసుకున్న ఒక వీడియోను షేర్ చేసింది. ఆమె ఒక సెల్ఫీ కూడా క్లిక్ చేసింది. ఇందులో ఆమె బూడిద రంగు దుస్తుల్లో కనిపిస్తుంది. ఆమె టోపీ, గాగుల్స్ కూడా ధరించింది. దీనికి హైదరాబాద్ రోడ్ల నుంచి అనే క్యాప్షన్ రాసింది. అంటే హైదరాబాద్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది.
బుధవారం నాడు హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రియాంకాను కొంతమందిని కలుసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్చేశారు. నటి సాధారణ దుస్తుల్లో తన సిబ్బందితో కలిసి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చింది. ప్రియాంక ఈ సినిమా కోసం చాలాసార్లు హైదరాబాద్‌కు వచ్చింది.
కొత్తగా వస్తున్న సినిమా గురించి నాలుగు రోజుల క్రితం ప్రియాంక, మహేష్ బాబు, SS రాజమౌళి Xలో పరస్పర మాట్లాడుకోవం కనిపించింది. నవంబర్ వచ్చేసింది SS రాజమౌళి. నవంబర్‌లో ఏదో జరుగుతుందని మీరు చెప్పారు. మీ మాటను నిలబెట్టుకోండి అని మహేష్ బాబు ప్రశ్నించారు. దీనిపై SS రాజమౌళి స్పందిస్తూ - ఇది ఇప్పుడే ప్రారంభమైంది, మహేష్. కచ్చితంగా చెబుతాం అని అన్నారు. దీని తరువాత, మహేష్ ప్రియాంకను ట్యాగ్ చేశారు. ఆమె హైదరాబాద్ నుంచి చాలా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోందని చెప్పారు. దీనిపై ప్రియాంక ఇలా రాసుకొచ్చింది."హలో, హీరో, మీరు నాతో పంచుకున్న సెట్‌లోని అన్ని స్టోరీలను లీక్ చేయాలనుకుంటున్నారా? అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
నవంబర్ 15న గ్రాండ్ ఈవెంట్
నవంబర్ 15న సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమం జరగనుంది. ఆ రోజున, రాజమౌళి మొత్తం తారాగణంతో కలిసి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఇది సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇప్పటికే దీనిపై జోరుగా ప్రచారం చేస్తున్నారు.