Rajinikanth Movie With Kamal Haasan Starts : ఎట్టకేలకు వెయిటింగ్‌కు బ్రేక్ పడింది. 46 ఏళ్ల తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఇద్దరూ కలిసి నటిస్తారనే ప్రచారం సాగగా... ఈ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు కమల్.

Continues below advertisement

డైరెక్టర్ ఎవరో తెలుసా? 

ఈ మూవీకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగినా... సీనియర్ డైరెక్టర్ సుందర్ సి ఆ ఛాన్స్ దక్కించుకున్నారు. కమల్‌కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. రెడ్ జెయిట్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రిలీజ్ కానుంది. రజినీ కెరీర్‌లో ఇది 173వ సినిమా. తలైవా, సుందర్ సి దర్శకత్వంలో ఇది రెండో మూవీ. 28 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అరుణాచలం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Continues below advertisement

తండ్రి ఆస్తి కోసం కొడుకు 30 రోజుల్లో రూ.30 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు? దీనికి ఆ తండ్రి పెట్టిన కండీషన్స్ ఏంటి? అనేదే ప్రధానాంశంగా 'అరుణాచలం' తెరకెక్కింది. అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ మూవీ. ఇప్పుడు అదే రిజల్ట్ రిపీట్ అవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'వెయిటింగ్' అంటూ పోస్టులు పెడుతున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీ 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని కమల్ హాసన్ తెలిపారు. 'మా ఇద్దరి మధ్య 5 దశాబ్దాల స్నేహం, సోదర బంధానికి ఈ మూవీ వేడుక వంటిది.' అని కమల్ అన్నారు. అయితే, మూవీలో కమల్ నటిస్తారా? లేదా నిర్మాతగానే ఉంటారా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఈ మూవీ ఏ జానర్‌లో ఉంటుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రజినీకాంత్ 'జైలర్ 2' మూవీతో బిజీగా ఉన్నారు.

Also Read : SSMB29 కోసం హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా- క్యాప్ పెట్టుకుని కూల్‌గా కనిపించిన బ్యూటీ

1970లో రజినీకాంత్, కమల్ హాసన్ ఫస్ట్ టైం మూవీ చేశారు. దాదాపు 5 భాషల్లో 20కి పైగా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. 1979లో వచ్చిన 'అల్లావుద్దీనుమ్ అల్ఖూత విలక్కం'లో నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.