Prithviraj Sukumaran First Look From SSMB29 : 'SSMB29' నుంచి సడన్ సర్ ప్రైజ్ వచ్చేసింది. మహేష్ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కోసం ఎదురు చూస్తోన్న యావత్ సినీ ప్రపంచానికి దర్శక ధీరుడు రాజమౌళి ముందే బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా మూవీలో ఓ లుక్ రిలీజ్ చేశారు.
పృథ్వీరాజ్ లుక్
మూవీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇదివరకూ ఎన్నడూ చూడని విధంగా పృథ్వీరాజ్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన విలన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుండగా... రాజమౌళి విజన్ అదిరిపోయిందంటూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
క్రూరమైన 'కుంభ'
'SSMB29'లో క్రూరమైన విలన్ 'కుంభ'గా ఆయన కనిపించబోతున్నారు. రోబోటిక్ చైర్‌లో కూర్చుని ఉండగా వెనుక రోబోటిక్ హ్యాండ్స్‌తో ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉన్న లుక్ వేరే లెవల్‌లో ఉంది. రోబోటిక్ చైర్‌లో స్టైల్‌గా కూర్చోగా... వెనుక ఆఫ్రికన్ అడవుల్లో ఉండే వాటర్ ప్లాంట్స్ బ్యాగ్రౌండ్‌గా ఉండడం హైప్ పదింతలు చేసింది. 'పృథ్వీతో ఫస్ట్ షాట్ షూట్ చేసిన తర్వాత నేను అతని దగ్గరకు వెళ్లి... మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు అని చెప్పాను.
ఈ దుష్ట, క్రూరమైన శక్తిమంతమైన విరోధి 'కుంభ'కు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో ఒదిగిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు రాజమౌళి.
వెయిటింగ్ ఫర్ బిగ్ అప్డేట్
పృథ్వీరాజ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంటే హీరో మహేష్ లుక్ ఇంకా ఎలా ఉంటుందో? అంటూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 15 కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం 'SSMB29' పోస్టులతో హోరెత్తిపోతోంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన రాజమౌళి ఈ మూవీతో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్నట్లు అర్థమవుతోంది. హీరో ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కోసమే భారీగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న ఈవెంట్ జరగనుండగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి అండ్ టీంతో పాటు టాలీవుడ్ సినీ పెద్దలు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. లుక్ కోసం ఇంతటి స్థాయిలో ప్లాన్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 'సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు #Globetrotter ఈవెంట్ కోసం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న ఈవెంట్ మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా.' అంటూ రాజమౌళి ట్వీట్ చేయడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ ఈవెంట్ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read : మీ వెయిట్ ఎంత? - జర్నలిస్ట్ ప్రశ్నకు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్... సింగర్ చిన్మయి అమేజింగ్ రియాక్షన్
టైటిల్ అదేనా?
ఈ మూవీకి 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ ఫస్ట్ లుక్‌తో టైటిల్ రివీల్, గ్లింప్స్ వీడియో ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస యాత్ర ఈ మూవీ అని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్‌పై జక్కన్న ఆవిష్కరించబోతున్నారు.
మూవీలో మహేష్ బాబు హీరో కాగా... ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు.