The Exorcism Of God Movie Explained In Telugu: 2012లో విడుదలైన హాలీవుడ్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ది ఎక్సార్సిజం ఆఫ్ గాడ్’. అలెజాండ్రో హిడాల్గో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విల్ బీన్‌ బ్రింక్, మరియా గాబ్రియేలా డి ఫారియా, జోసెఫ్ మార్సెల్ కీలక పాత్రలు పోషించారు.


(First on ABP దేశం: వివిధ ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న ఎన్నో ఆసక్తికరమైన.. భిన్నమైన సినిమాలు, సీరిస్‌లను అందరి కంటే ముందు అందించేది ‘ఏబీపీ దేశం’ మాత్రమే. కాపీ కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని పాఠకులకు మనవి.)


దెయ్యం పట్టిన అమ్మాయితో ఫాదర్ పాడుపని


మంగ్లీ అనే అమ్మాయిని చూపించడంతో సినిమా మొదలవుతుంది. ఆ అమ్మాయిని ఓ దెయ్యం ఆవహించి ఉంటుంది. ఆమె పూర్తిగా దెయ్యం ఆధీనంలో ఉంటుంది. అందుకే ఆమెను ఆ ఇంట్లో వాళ్ల ఓ గదిలో మంచానికి కట్టేసేవాళ్లు. మంగ్లీని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు ఓ ఫాదర్ ను పిలిపిస్తారు. ఫాదర్ అందరినీ బయటకు పంపి ఇంట్లో డోర్ లాక్ చేస్తాడు. అక్కడ ఓ కెమెరాను ఫిక్స్ చేసి మంగ్లీ బాడీలో నుంచి దెయ్యాన్ని వదిలించే ప్రయత్నం చేస్తాడు. దెయ్యం అతడి ధ్యాసను మళ్లించే ప్రయత్నం చేస్తుంది. అయినా, తను చాలా నిగ్రహంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మంగ్లీతో ఫాదర్ ప్రేమలో పడతాడు. ఆ విషయం దెయ్యానికి కూడా తెలిసిపోతుంది. అలాగే అతడిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా, తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ప్రేయర్ చేస్తూనే ఉంటాడు. దెయ్యం ఫాదర్ ను ధ్యాస మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దెయ్యం ఎన్ని వేషాలు వేసినా తను మాత్రం అలాగే ప్రార్థన చేస్తుంటాడు. అయితే, మంగ్లీ సృహతప్పి పడిపోతుంది. ఫాదర్ ఆమెను పరిశీలిస్తాడు. ఆమెలో నుంచి దెయ్యం వెళ్లిపోతుంది. వెంటనే ఆమె ఫాదర్ ను కిస్ చేస్తుంది. ఫాదర్ కూడా ఆమెతో శరీరకంగా కలుస్తాడు. ఈ విషయం కెమెరాలో రికార్డు అవుతుంది.


18 ఏండ్ల తర్వాత మళ్లీ సేమ్ సీన్ రిపీట్


సీన్ కట్ చేస్తే 18 సంవత్సరాల తర్వాత కథ మొదలవుతుంది. ఒక జైల్లో గార్డు ఖైదీలకు భోజనం ఇస్తుంటాడు. ఓ ఖైదీకి ఫుడ్ ఇస్తుండగా ఓ ఖైదీ గార్డు చేతి వేళ్లను కొరికేస్తుంది. మరోవైపు ఫాదర్ పీటర్.. మంగ్లీ విషయంలో తాను చేసిన తప్పును గుర్తు చేసుకుని ఇప్పటికీ ఫీలవుతాడు. ఫాదర్ తన కంటే సీనియర్ ఫాదర్ దగ్గరికి వెళ్లి తన తప్పును ఒప్పుకుంటాడు. తన తప్పుకు సంబంధించిన సాక్ష్యం వీడియో క్యాసెట్ ను ఫాదర్ కి ఇవ్వాలి అనుకుంటాడు. కానీ, ఇంతలోనే పీటర్ కు ఫాదర్ పెద్ద మొత్తంలో ఫండ్ ఇస్తాడు. దీంతో ఆ క్యాసెట్ ను ఫాదర్ కు ఇవ్వకుండా దాచేస్తాడు. ఆ ఫండ్ తో తన చర్చిలో ఉన్న పిల్లలకు కావాల్సిన వస్తువులను కొనిస్తాడు. ఆ రాత్రి జైలు నుంచి ఫాదర్ కు కాల్ వస్తుంది. మా గార్డులలో ఒకరి పరిస్థితి దారుణంగా ఉంది. అతడికి డాక్టర్ అవసరం కంటే మీ అవసరమే ఎక్కువగా ఉందని, వెంటనే రావాలని చెప్తారు. ఫాదర్ ఆ జైలుకు వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూపిస్తారు. దయ్యం ఆ అమ్మాయిని పూర్తిగా ఆవహించి ఉంటుంది. ఆ అమ్మాయి ఒక చావుకి కారణం అయ్యిందని జైల్లో వేస్తారు. ఆ అమ్మాయి కూడా గతంలో మంగ్లీలాగే ప్రవర్తిస్తుంది. అది చూసి ఫాదర్ షాక్ అవుతాడు. వెంటనే గది నుంచి బయటకు వచ్చి తాను 18 ఏళ్ల క్రితమే దయ్యాలను వదిలించడం మానేశాననని చెప్తాడు. ఈ విషయంలో తాను సాయం చేయలేనని చెప్తాడు.


మంగ్లీ- ఫాదర్ కు పుట్టిన బిడ్డే జైల్లో ఉన్న అమ్మాయి


ఇక్కడే ఓ ట్విస్టు ఉంటుంది. మంగ్లీ అక్కడికి వస్తుంది. మీరు తప్పకుండా సాయం చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి మీకు, నాకు పుట్టిన బిడ్డ అని చెప్తుంది. మీరే ఆమెను కాపాడాలి అంటుంది. మంగ్లీ కూడా ఫాదర్ ను క్షమిస్తుంది. అదే సమయంలో తన కూతురును కాపాడుకోవడం కోసం పీటర్ సీనియర్ ఫాదర్ అయిన మైఖేల్ ను కలుస్తారు. అయితే, ఆ అమ్మాయి తన కూతురు అనే విషయం చెప్పడు. ఆ తర్వాత రోజు దయ్యాన్ని తరిమే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఫాదర్లు భావిస్తారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత జైలు నుంచి అందరినీ బయటకు పంపించి ఫాదర్లు లోపలికి వెళ్తారు. వాళ్లకు ఓ డాక్టర్ కూడా సాయం చేస్తారు. అప్పుడు సడెన్ గా కరెంటు పోతుంది.


డాక్టర్ కు అక్కడే ఓ పోలీసు డెడ్ బాడీ కనిపిస్తుంది. అతడు దారుణంగా చంపబడతాడు. వెంటనే డాక్టర్ ఫాదర్ ను పిలుస్తాడు. ఈలోగా ఆ అమ్మాయికి ఇంజెక్షన్ చేయాలి అనుకుంటాడు. ఆ దయ్యం పట్టిన అమ్మాయి డాక్టర్ మీద దాడి చేస్తుంది. అక్కడ అరుపులు విని ఫాదర్లు ఇద్దరూ అక్కడికి వెళ్తారు. డాక్టర్ ఫాదర్ ని అక్కడి నుంచి పారిపోవాలని చెప్తాడు. అదే సమయంలో దెయ్యం జైల్లోని ఖైదీలందరినీ తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఫాదర్స్ ఇద్దరూ ఆ దయ్యాన్ని తరిమి కొట్టేందుకు ప్రార్థనలు మొదలుపెడతారు. సీనియర్ ఫాదర్ ప్రార్థనకు దెయ్యాలు వెనక్కి వెళ్లిపోతాయి. అయితే, పీటర్ ప్రార్థనకు దెయ్యాలు ఏమాత్రం వెనక్కి తగ్గవు. ఎందుకంటే అతడి ప్రేయర్ లో బలం ఉండదు. అప్పుడు దెయ్యాల దాడి ఎక్కువ అవుతుంది.


వెంటనే ఫాదర్ పీటర్ ను తీసుకుని సీనియర్ ఫాదర్ కిచన్ లోకి వెళ్లి లాక్ చేస్తాడు. నువ్వు ఏం పాపం చేశావ్? అంటూ నిలదీస్తాడు. అప్పుడు పీటర్ 18 ఏళ్ల క్రితం జరిగిన తప్పు గురించి చెప్తాడు. ఫాదర్ మైఖేల్.. పీటర్ ను దయ్యాలకు దూరంగా ఉండాలని చెప్తాడు. లేదంటే, దెయ్యాలు నిన్ను ఆధీనంలోకి తీసుకుని ఎక్కువ తప్పులు చేయిస్తుందని చెప్తాడు. వెంటనే పీటర్ అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుంటాడు. తను చేసిన తప్పుకు సంబంధించి వీడియో రికార్డు చేసి బిషప్ కు పంపిస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి పీటర్ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఆయన ప్రేయర్ పని చేస్తుంది.


ఎందుకంటే దేవుడు అతడిని క్షమించి పవర్స్ ఇస్తాడు. అప్పుడు సడెన్ గా దయ్యం వెనుక నుంచి వచ్చి ఫాదర్ మీద దాడి చేస్తుంది. ఆ తర్వాత ఫాదర్ ను కట్టేసి రెచ్చగొడుతుంది. ఫాదర్ దయ్యంతో తన కూతురును వదిలేయాని వేడుకుంటాడు. నేను నీ కూతురును వదిలేస్తే నీ చర్చిలోని ఒక్క పిల్లాడు కూడా బతకడని చెప్తుంది. నీ కూతురు కావాలా? అనాథ పిల్లలు కావాలా? అని అడుగుతుంది. అసలు నీకు ఏం కావాలో చెప్పు అంటూ దయ్యాన్ని ఫాదర్ అడుగుతాడు. నువ్వు నీలో నుంచి దేవుడిని తీసెయ్.. అప్పుడు నీ కూతురును, చర్చి పిల్లలను వదిలేస్తానని చెప్తుంది. ఫాదర్ సరే అనడంతో దెయ్యం వెళ్లిపోతుంది. తర్వాత ఫాదర్ తన కూతురును తీసుకుని జైలు నుంచి బయటకు వస్తాడు.


పీటర్ లోకి ప్రవేశించిన దెయ్యం


ఫాదర్ పీటర్ ను బిషప్ చూసి, చేసిన తప్పును ఒప్పుకున్నందుకు దేవుడు నిన్ను క్షమించాడు. నీకు పవర్స్ ఇచ్చాడు. నేను నీ వీడియోను కూడా డిలీట్ చేశాను అని చెప్తాడు. అప్పుడే ఫాదర్ కళ్లలో మెరుపు కనిపిస్తుంది. నువ్వు ఫాదర్ బాడీలో ఏం చేస్తున్నావ్ అని దెయ్యాన్ని అడుగుతాడు బిషప్. తన కూతురు, చర్చి పిల్లలను కాపాడుకునేందుకు ఫాదర్ తన ఆత్మను నాకు సమర్పించాడు అని చెప్తుంది. అదే సమయంలో ఫాదర్ కూతురు కళ్లలో మెరుపు కనిపిస్తుంది. దేవుడు ఆమెకు శక్తులు అందిస్తాడు. ఫాదర్ ఆ ఊరి నుంచి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.


Also Read: దెయ్యాలకు క్లాస్ చెప్పే టీచర్, కోపంతో చచ్చినవారిని మళ్లీ చంపేస్తుంది - ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఊహించలేరు