Siddu Jonnalagadda's Telusu Kada OTT Release On Netflix : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' గత నెలలో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీలోకిి వచ్చేందుకు రెడీ అవుతోంది. నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా... అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Continues below advertisement

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీ నీరజ కోన దర్శకత్వం వహించగా ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. సిద్ధు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ మూవీని నిర్మించారు.

Continues below advertisement

Also Read : పిఠాపురంలో ఇల్లు కట్టుకున్న 'పెద్ది' దర్శకుడు... సతీసమేతంగా గృహప్రవేశం

స్టోరీ ఏంటంటే?

అనాథగా పెరిగిన వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) తనకంటూ ఓ కుటుంబం కావాలని తాపత్రయ పడతాడు. కాలేజీ రోజుల్లోనే రాగ (శ్రీనిధి శెట్టి)ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, అనుకోకుండా రాగ అతనికి దూరం అవుతుంది. ఆ తర్వాత బ్రేకప్ నుంచి బయటపడిన వరుణ్... అంజలి (రాశీ ఖన్నా)ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టం. అన్యోన్యంగా సాగుతున్న వారి లైఫ్‌లో ఊహించని సమస్య ఎదురవుతుంది. 

ఆ సమస్య వల్లే రాగ మళ్లీ వరుణ్ జీవితంలోకి వస్తుంది. దీన్ని అంజలి కూడా అంగీకరిస్తుంది. అసలు వరుణ్, అంజలిలకు వచ్చిన సమస్య ఏంటి? రాగ మళ్లీ ఎందుకు వరుణ్ జీవితంలోకి వస్తుంది? వరుణ్‌ను రాగ ఎందుకు వదిలి వెళ్లిపోయింది? రాగ వచ్చాక అంజలి, వరుణ్‌ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇవి తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'

ఈ మూవీతో పాటే మరో 2 మూవీస్ కూడా అదే రోజు నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానున్నాయి. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, 'ప్రేమలు' ఫేం మమితా బైజు జంటగా నటించిన రీసెంట్ లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' ఈ నెల 14 నుంచే ఓటీటీలోకి తెలుగుతో పాటు తమిళ భాషల్లోకి అందుబాటులోకి రానుంది. ఈ మూవీతో ప్రదీప్ హ్యాట్రిక్ విజయం సాధించారు. తక్కువ టైంలోనే రికార్డు కలెక్షన్స్‌తో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.

ధ్రువ్ విక్రమ్ 'బైసన్'

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ కుమారుడు ఫస్ట్ తెలుగు మూవీ 'బైసన్' కూడా ఈ నెల 14 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా... ధ్రువ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు.