Buchi Babu Sana Housewarming Ceremony: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'ఉప్పెన'. దర్శకుడు సానా బుచ్చిబాబుకు సైతం అది తొలి సినిమా. ఫస్ట్ మూవీ తో 100 కోట్ల క్లబ్బులో చేరారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. దర్శకుడిగా బుచ్చిబాబు రెండో చిత్రం ఇది. కెరీర్ పరంగా ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్సే. ఇప్పుడు ఈ దర్శకుడు కొత్త ఇంటిలో అడుగు పెట్టారు.
పిఠాపురంలో బుచ్చిబాబు ఇల్లు...సతీ సమేతంగా గృహప్రవేశ వేడుక!ఇప్పుడు పిఠాపురం పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గట్టిగా వినబడుతోంది అందుకు కారణం... ఆ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే. బుచ్చిబాబు సానా సొంతూరు కూడా అదే.
పిఠాపురంలో తన కలల ఇంటిని కట్టుకున్నారు బుచ్చిబాబు సానా. ఆ ఇంటి పనులు పూర్తి అయ్యాయి. మంచి ముహూర్తం ఉండడంతో శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఆ వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హాజరు అయినట్లు తెలిసింది. గృహప్రవేశం ఉండడం వల్ల ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు ఆయన హాజరు కాలేకపోయారని సమాచారం.
Also Read: ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్... రెండో రోజు రష్మిక డబుల్ ధమాకా - 2 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ఒక వైపు సొంతింటిలో అడుగు...మరో వైపు 'పెద్ది' పాట సూపర్ హిట్!బుచ్చిబాబు సానా జీవితంలో ఈ వారం ఎప్పటికీ మరిచిపోలేని రోజులు అని చెప్పవచ్చు ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఆయన కోరుకున్న అడుగు పడింది సొంత ఇంటిలో అడుగు పెట్టారు. మరొక వైపు సినిమాలకు వస్తే 'పెద్ది' సినిమాలో మొదటి పాట 'చికిరి చికిరి' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ రెండు మెమొరబుల్ మూమెంట్స్ అని చెప్పవచ్చు.
Also Read: 'జటాధర' ఓపెనింగ్ డే కలెక్షన్స్... సుధీర్ బాబు కెరీర్‌లో మరో డిజాస్టర్?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'పెద్ది'. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్. రామ్ చరణ్ సరసన ఆమెకు తొలి చిత్రం ఇది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా మొదటి సినిమా. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.