హీరోలు ఎవరైనా సరే సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తారు. ఆ దిశగా అడుగులు వేస్తారు. ఒకవేళ లాస్ట్ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమాపై కేర్ ఎక్కువ తీసుకుంటారు. సుధీర్ బాబు విషయంలో ఇది రివర్స్‌లో జరుగుతోందా? అని ఘట్టమనేని అభిమానుల్లోనూ అనుమానాలు కలుగుతున్నాయి. 'జటాధర' సినిమా చూసి ఫ్యాన్స్ సైతం షాక్ తిన్నారు. సుధీర్ బాబు ఇంత పూర్ క్వాలిటీ సినిమా చేయడం ఏమిటని! క్రిటిక్స్ రివ్యూలు, మౌత్ టాక్ మాత్రమే కాదు... కలెక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Continues below advertisement

జటాధర vs హరోం హర...ఫస్ట్ డే ఏ సినిమా కలెక్షన్ ఎంత?Jatadhara Box Office Collection Day 1: 'జటాధర'కు మొదటి రోజు ఇండియాలో రూ. 1.07 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఇది నెట్ కలెక్షన్. తెలుగులో రూ. 85 లక్షలు రాగా... హిందీలో రూ. 22 లక్షలు వచ్చాయి. టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ రూ. 1 కోటి 7 లక్షలు. 

సుధీర్ బాబు లాస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. ఆ మూవీ ఫస్ట్ డే ఇండియా నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా? కేవలం 19 లక్షలు మాత్రమే. అది యాక్షన్ ఫిల్మ్ కాదు. ముందు నుంచి బజ్ లేదు. పైగా ఎమోషనల్ ఫిలిమ్. అందుకని ఆ మూవీ తీసి పక్కన పెడదాం. అంతకు ముందు చేసిన 'హరోం హర'ను తీసుకుంటే... ఆ సినిమాకు మొదటి రోజు రూ. 1.05 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది.

Continues below advertisement

Also Read'జటాధర' రివ్యూ: సుధీర్ బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా? - అసలు థియేటర్లలో ఈ సినిమాను చూడగలమా?

'హరోం హర'తో నవ దళపతి ట్యాగ్ వేసుకున్నారు సుధీర్ బాబు. డిఫరెంట్ యాక్షన్ సినిమా అన్నట్టు పబ్లిసిటీ చేశారు. ఆ మూవీ కేవలం రూ. కోటి రాబట్టింది. ఇప్పుడు 'జటాధర'ను డివోషనల్ థ్రిల్లర్ అని గొప్పగా చెప్పారు. అయితే ఈ సినిమాకు ఫస్ట్ డే డిజాస్టర్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా గొప్పగా లేవు. కోటి రూపాయలకు ఒక 7 లక్షలు ఎక్కువ వచ్చాయి. రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయని, మౌత్ టాక్ వల్ల కిందకు పడ్డాయని ట్రేడ్ వర్గాల టాక్. సుధీర్ బాబు కెరీర్‌లో ఇది మరొక డిజాస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

'జటాధర'తో సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. తెలుగులో ఆమెకు మొదటి సినిమా ఇది. క్యారెక్టర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆవిడ మార్క్ ఏమీ చూపించలేదు. దాంతో సోనాక్షి సిన్హాకు తెలుగులో నెక్స్ట్ ఛాన్స్ రావడం కష్టం అని చెప్పాలి. సుధీర్ బాబు పెయిర్ కింద చేసిన దివ్య కోస్లా కుమార్ కు సైతం ఇదే మొదటి తెలుగు సినిమా. ఆవిడకూ మరొక అవకాశం రావడం కష్టం.

Also Read: 'ఆర్యన్' రివ్యూ: మరణించిన వ్యక్తి వరుస హత్యలు ప్లాన్ చేస్తే... తమిళ్ సీరియల్ కిల్లర్ కథ ఎలా ఉందంటే?