Aaryan Telugu Review - 'ఆర్యన్' రివ్యూ: మరణించిన వ్యక్తి వరుస హత్యలు ప్లాన్ చేస్తే... తమిళ్ సీరియల్ కిల్లర్ కథ ఎలా ఉందంటే?

Aaryan Movie Review Telugu: విష్ణు విశాల్, సెల్వ రాఘవన్ హీరో & విలన్‌గా... శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ 'ఆర్యన్'. తెలుగులో వారం ఆలస్యంగా నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement

Vishnu Vishal's Aaryan Review In Telugu: తమిళ కథానాయకుడు, తెలుగింటి అల్లుడు విష్ణు విశాల్ నటించిన తాజా సినిమా 'ఆర్యన్'. ఇందులో సెల్వ రాఘవన్ విలన్. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్ర పోషించగా... విష్ణు విశాల్ జంటగా మానసా చౌదరి నటించారు. తమిళంలో అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాను తెలుగులో వారం ఆలస్యంగా నవంబర్ 7న విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది?

Continues below advertisement

కథ (Aaryan Movie Story): ఓ టీవీ ఛానల్ లైవ్‌లో తనను తాను షూట్ చేసుకుని మరణిస్తాడు ఆత్రేయ (సెల్వ రాఘవన్). ఆత్మహత్య చేసుకోబోయే ముందు రోజుకు ఒక్కరి చొప్పున రాబోయే ఐదు రోజుల్లో ఐదుగుర్ని హత్య చేస్తానని చెబుతాడు. ఆ మాట ప్రకారం... రోజుకొకరి పేరు అనౌన్స్ చేస్తాడు. అతను చెప్పిన పేరు గల వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణిస్తారు కూడా!

మరణించిన వ్యక్తి వీడియోలు ప్రతిరోజూ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లోకి ఎలా వస్తున్నాయి? వాటి వెనుక ఎవరు ఉన్నారు? డీసీపీ నంది (విష్ణు విశాల్)కి సవాలుగా మారిన ఈ కేసును ఎలా పరిష్కరించాడు? ఆత్రేయ ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షి, టీవీ షో హోస్ట్ నయన (శ్రద్ధా శ్రీనాథ్) కేసు విచారణలో ఏ విధంగా సాయపడింది? ప్రేమ వివాహం చేసుకున్న అనిత (మానసా చౌదరి) విడాకులకు ఎందుకు అప్లై చేసింది? అనేది సినిమా.

విశ్లేషణ (Aaryan Telugu Review): థ్రిల్లర్స్, మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు లాజిక్స్ ఇంపార్టెంట్. అలాగే, ప్రారంభంతో పాటు ముగింపు సైతం ప్రేక్షకులను శాటిస్‌ఫై చేసేలా ఉండాలి. 'ఆర్యన్' దురదృష్టం ఏమిటంటే... ఈ సినిమాలో లాజిక్స్ అసలు లేవు. పోనీ ప్రేక్షకులు మెచ్చేలా ఎండింగ్ ఉందా? అంటే అదీ లేదు. దాంతో ఆరంభ శూరత్వంలా మిగిలిందీ సినిమా.

ఐడియా పరంగా 'ఆర్యన్' కథ చాలా బావుంది. ప్రారంభించిన తీరు సైతం ఆసక్తి కలిగిస్తుంది. లైవ్ / టీవీలో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్యకు ముందు వచ్చే ఐదు రోజుల్లో ఐదుగురు మరణిస్తారని - వీలైతే అడ్డుకోమని పోలీసులకు సవాల్ విసరడం కథ - సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

Also Read'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ: రాహుల్ రవీంద్రన్ అబ్బాయిలకు వ్యతిరేకంగా తీశారా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?

మాంచి హుక్ పాయింట్‌తో 'ఆర్యన్' స్టార్ట్ చేసిన దర్శకుడు ప్రవీణ్ కే... రేసీ థ్రిల్లర్ చూడబోతున్నారన్నట్టు సెటప్ రెడీ చేశాడు. అయితే... మరణించిన వ్యక్తి హత్యలు ఎలా చేస్తున్నాడు? వీడియోలు ఎలా విడుదల చేస్తున్నాడు? అనేది కన్వీసింగ్‌గా రాసుకున్నాడు. హీరో పర్సనల్ లైఫ్ ట్రాక్ ఇరికించినట్టు ఉంటుంది. లాజిక్స్‌ విషయంలో పూర్తి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. ఎండింగ్ చూశాక ఈమాత్రం దానికి చంపడం ఎందుకు? అనేంతలా ముగించాడు. క్లైమాక్స్‌లో చెప్పిన థియరీ అసలు బాలేదు. దాంతో డీసెంట్ / ఏవరేజ్ అవ్వాల్సిన సినిమా బిలో ఏవరేజ్ మార్క్ కంటే కొంచెం కిందకు పడింది. టెక్నికల్ పరంగా కెమెరా వర్క్ బావుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఓ టెంప్లేట్‌లో సాగింది. లౌడ్ & రిపీట్ ఆర్ఆర్ ఎగ్జైట్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది.

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విష్ణు విశాల్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. విలన్‌గా సెల్వ రాఘవన్ నటన, లుక్స్ సినిమాపై ఆసక్తి కలిగిస్తాయి. సినిమా ప్రారంభంలో శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర పవర్ ఫుల్ అన్నట్టు చూపించారు. చివరకు వచ్చేసరికి కూరలో కరివేపాకుగా మార్చేశారు. మానసా చౌదరి పాత్రకు ఇంపార్టెన్స్ లేదు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు తక్కువ.

'ఆర్యన్' ఐడియా బావుంది. దర్శక రచయిత ప్రవీణ్ కె మంచి పాయింట్‌తో సినిమా తీశాడు. అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. సీరియల్ కిల్లర్ కథలకు... విలన్ చేసే వరుస హత్యలకు బలమైన కారణం ఉండాలి. నావెల్టీ లేదా కొత్త పాయింట్ పేరుతో సందేశం ఇవ్వాలని లేదా విలన్‌ను మంచోడిని చేయాలని ట్రై చేస్తే అసలుకు ఎసరు వస్తుంది. 'ఆర్యన్' విషయంలో అదే జరిగింది. నో థ్రిల్స్, ఓన్లీ డ్రామా & కొన్ని ట్విస్టులు... అంతే!

Also Read: 'జటాధర' రివ్యూ: సుధీర్ బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా? - అసలు థియేటర్లలో ఈ సినిమాను చూడగలమా?

Continues below advertisement
Sponsored Links by Taboola