Horror Thriller Jarann Movie Telugu Version OTT Streaming On Zee 5 : హారర్ థ్రిల్లర్ మూవీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ భాషలోనైనా అలాంటి కంటెంట్‌నే ఎక్కువగా మూవీ లవర్స్ ఇష్టపడుతుంటారు. తెలుగులో అయితే ఆ క్రేజ్ మరీ ఎక్కువ. తాజగా మరో మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'జారన్' తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

Continues below advertisement

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

నిజానికి ఆగస్ట్ 8నే 'జారన్' మూవీ అందుబాటులోకి వచ్చినా తెలుగు వెర్షన్ మాత్రమే తాజాగా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ 'Zee5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'మీరు ఈ హారర్ నుంచి తప్పించుకోలేరు. అది మీకు ఎప్పుడూ ఓ మార్గాన్ని కనుగొంటుంది.' అంటూ రాసుకొచ్చింది. ఓ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఈ మూవీలో అమృతా సుభాష్, అనితా డేట్ కేల్కర్, కిషోర్ కదమ్, జ్యోతి మల్షే, అవనీ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించగా... హృషికేష్ గుప్తా దర్శకత్వం వహించారు.

Continues below advertisement

Also Read : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేసిన నేషనల్ క్రష్?

స్టోరీ ఏంటంటే?

గ్రామాల్లో చేతబడి, బాణామతి, మూఢ నమ్మకాల బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కింది. 'జారన్' అంటే మరాఠీలో 'చేతబడి' అని అర్థం. చేతబడి ప్రభావంతో ఓ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే ఈ మూవీ స్టోరీ. ఇక కథ విషయానికొస్తే... ఓ విలేజ్‌లో రాధ (అమృతా ఘోష్) కుటుంబం ఉంటుంది. రాధకు వివాహం జరిగిన తర్వాత తన భర్తతో కలిసి సిటీలో ఉంటుంది. వారికి కూతురు సైయీ పుడుతుంది. చిన్నప్పటి నుంచి తాను ఉంటున్న ఇంటిని అమ్మాలని రాధ తల్లిదండ్రులు చూస్తారు.

ఈ క్రమంలోనే రాధ ఆ ఇంటిని చూడాలని తన కూతురితో కలిసి వెళ్తుంది. అయితే, ఆ ఇంట్లోని ఓ గదికి ఎప్పుడూ తలుపులు వేసే ఉంటాయి. రాధకి పదేళ్ల వయసున్న టైంలో ఆ గదిలో గంగూతి (అనితా కేల్కర్) ఉండేది. ఆమె చేతబడి చేస్తుందని అంతా భయపడేవారు. చుట్టుపక్కల వారు ఆమెను ఇంటి నుంచి తరిమేయగా క్షుద్రపూజలు చేసిన బొమ్మ అలానే ఉండిపోతుంది. గంగూతి వెళ్లినప్పటి నుంచి రాధ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ ఇంట్లో మనశ్సాంతి అనేది ఉండదు. అయితే, ఆ బొమ్మను తన కూతురి కోసం రాధ మళ్లీ బయటకు తెస్తుంది. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అసలు రాధకు ఎవరు ఎందుకు చేతబడి చేశారు? చివరకు ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.