Kiran Abbavaram's K Ramp OTT Release Date Locked : టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కె ర్యాంప్'. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. కిరణ్ ఖాతాలో 'కె ర్యాంప్'తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ పడింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Continues below advertisement

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'ఆహా' సొంతం చేసుకోగా... ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. జైన్స్ నానీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. 

Continues below advertisement

మూవీలో కిరణ్, యుక్తి తరేజాలతో పాటు సీనియర్ హీరోస్ నరేష్, సాయి కుమార్, కమెడియన్ వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, 'అమృతం' సీరియల్ ఫేం నారిపెద్ది శివన్నారాయణ, అలీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించగా... చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే నుంచే మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. రూ.50 కోట్ల మార్క్ అందుకుంది.

Also Read : రాజ్‌‌తో క్లోజ్‌గా సమంత - డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చేసినట్లేనా!... రెండో పెళ్లిపై చర్చ

స్టోరీ ఏంటంటే?

ఈ మూవీలో కిరణ్ డబుల్ డోస్ కామెడీ, పంచెస్‌తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) రిచ్చెస్ట్ చిల్లర్ గయ్. తండ్రి (సాయి కుమార్) అతి గారాబంగా ఏ లోటు లేకుండా పెంచుతాడు. కాస్ట్‌లీ కారు కొనిచ్చినా బస్తీల్లోనే తిరుగుతుంటాడు. ఫ్రెండ్స్‌తో పార్టీలతో లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. కుమార్‌ను కేరళ పంపిస్తే దారిలో పడతాడని చెప్పడంతో డొనేషన్ కట్టి మరీ అక్కడ కాలేజీలో చేర్పిస్తాడు తండ్రి.

అలా కేరళ వెళ్లిన కుమార్... అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)తో లవ్‌లో పడతాడు. పూర్తిగా ప్రేమలో మునిగిన తర్వాత ఆ అమ్మాయికి ఉన్న ఓ సమస్య బయటపడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడతాడు కుమార్. అసలు మెర్సీకి ఉన్న సమస్య ఏంటి? దాని వల్ల కుమార్ పడ్డ ఇబ్బందులు ఏంటి? హీరో హీరోయిన్‌కు చేసిన ప్రామిస్ ఏంటి? చివరకు హీరోయిన్ ఆ సమస్య నుంచి బయటపడగలిగిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.