Samantha New Cosy Photo With Raj Nidimoru : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అందుకు తగినట్లుగానే పలు ఈవెంట్లలో ఇద్దరూ కలిసి కనిపించారు. వెకేషన్స్, రెస్టారెంట్స్‌కు సైతం కలిసి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా... మరోసారి ఈ జంట ఓ ఈవెంట్‌లో సందడి చేశారు. 

Continues below advertisement

రాజ్‌ను హగ్ చేసుకున్న సమంత

సమంత ఏ ఈవెంట్‌కు వెళ్లినా అక్కడ రాజ్ కూడా వెళ్లడం కామన్. బయట దేశాలకు వెళ్లినా జంటగా కనిపిస్తూ సందడి చేశారు. రీసెంట్‌గా సమంత కొత్త సినిమా ప్రారంభోత్సవంలోనూ రాజ్ కనిపించారు. డేటింగ్ అంటూ ప్రచారం సాగినా ఇప్పటివరకూ ఎవరూ రియాక్ట్ కాలేదు. తాజాగా ఓ ఈవెంట్‌లోనూ కలవగా... ఈసారి క్లోజ్‌గా మూవ్ అయ్యారు. రాజ్‌ను సమంత హగ్ చేసుకుంటూ ఫోటోలు దిగారు. తన ఇన్ స్టాలో వీటిని షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం ఈ ఫోటోతో కన్ఫర్మ్ అయ్యిందంటూ దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క ఫోటోతో డేటింగ్ కన్ఫర్మ్ చేసేశారని అంటున్నారు.

Continues below advertisement

Also Read : బాలయ్య 'అఖండ' రుద్ర తాండవం - శివుడే నేలకు దిగి వచ్చాడా?... 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది

సమంత ఏమన్నారంటే?

ఈ ఫోటోలను షేర్ చేసిన సమంత... 'గత ఏడాదిన్నర కాలంలో నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని విశ్వసించడం, నేను ముందుకు సాగుతున్న క్రమంలో నేర్చుకోవడం. ఈ రోజు నేను చిన్న విజయాలను జరుపుకొంటున్నాను. నేను కలిసిన అత్యంత తెలివైన, కష్టపడి పని చేసే అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పని చేయడానికి నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. ఇది ప్రారంభమే అని నాకు తెలుసు.' అంటూ రాసుకొచ్చారు.

పెళ్లిపై చర్చ

ఒకే ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి క్లోజ్‌గా కనిపించడంతో వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాజ్ తన భార్య శ్యామాలిదేకు డివోర్స్ ఇవ్వబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత సమంత, రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2లో సమంత నటించగా... దీనికి రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత పలు సిరీస్‌ల్లోనూ నటించారు. 'శుభం' సక్సెస్ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. రీసెంట్‌గానే 'మా ఇంటి బంగారం' మూవీలో నటిస్తున్నారు.