Balakrishna's Akhanda Thaandavam Song Promo Released : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైెరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ డివోషనల్ టచ్ హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2'. ఈ మూవీ నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. పవర్ ఫుల్ అఖండ తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. 

Continues below advertisement

బాలయ్య రుద్ర 'తాండవం'

'అఖండ 2' నుంచి ఫస్ట్ ప్రోమో 'తాండవం' గూస్ బంప్స్ తెప్పించగా... అంతకు మించి అనేలా లేటెస్ట్ తాండవం ప్రోమో అదిరిపోయింది. అఖండ హిమాలయాల్లో శివాలయాల నడుమ ఒంటినిండా విభూదితో రౌద్రమైన కళ్లతో ఢమరుకం చేతబట్టి సాక్షాత్తూ పరమశివుడే నేలకు దిగి వచ్చాడా? అన్నట్లు బాలయ్య అఘోర లుక్ వేరే లెవల్‌లో ఉంది. 'అఖండ తాండవం' అంటూ... ఆయన జోష్‌కు తగ్గట్లుగా తమన్ బీజీఎం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. 

Continues below advertisement

ఈ పాటను శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించగా... కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ అందించారు. పూర్తి లిరికల్ సాంగ్ ఈ నెల 14న రిలీజ్ కానుంది.

డ్యూయల్ రోల్ 

ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి అఘోర పాత్ర అయితే, మరొకటి మురళీ కృష్ణ రోల్. రీసెంట్‌గా 'బ్లాస్టింగ్ రోర్' పేరుతో ఆయన లుక్ రివీల్ చేశారు మేకర్స్. 'సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో... దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు. కొడకా... ఊహకు కూడా అందదు.' అంటూ విలన్‌కు బాలయ్య ఇచ్చిన మాస్ వార్నింగ్ ట్రెండ్ సృష్టిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన 'తాండవం సాంగ్' అంతకు మించి అనేలా హైప్ పదింతలు చేసింది.

Also Read : ది ఫ్యామిలీ మ్యాన్ 3 ట్రైలర్ వచ్చేసింది - తెలుగులోనూ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

తమన్ బీజీఎం వేరే లెవల్

బాలయ్య అఖండ 'రుద్ర తాండవం'కు సరిగ్గా తనదైన స్టైల్‌తో బీజీఎం, మ్యూజిక్ అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. 'బ్లాస్టింగ్ రోర్' దగ్గర నుంచీ డివోషనల్ టచ్, మాస్ అంశాలకు తగ్గట్లుగా ఆధ్యాత్మికత, దైవత్వాన్ని పాటలు, శ్లోకాల రూపంలో ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ అప్డేట్స్ బట్టి అర్థమవుతోంది. సంస్కృత శ్లోకాల కోసం ఫేమస్ పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో పాటు క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్‌ను రంగంలోకి దించారు. ఇక మాస్ రోల్‌కు సంబంధించి థియేటర్స్‌లో బాక్సులు బద్దలు కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట మూవీని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్‌గా ఈ మూవీ నిలవనుంది.